AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్

Phani CH
|

Updated on: Nov 15, 2025 | 10:37 AM

Share

బాలీవుడ్ స్టార్ కాజోల్ వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ షోలో, ఆమె పెళ్లికి 'ఎక్స్‌పైరీ డేట్', 'రెన్యూవల్ ఆప్షన్' ఉండాలని అన్నారు. 26 ఏళ్ల వైవాహిక బంధంలో ఉన్న ఆమె ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. డబ్బుతో ఆనందం కొనుగోలు చేయలేమని కూడా ఆమె తెలిపారు.

బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ వివాహ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలని వ్యాఖ్యానించారు. ఈవ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. కాజోల్‌ వ్యాఖ్యలతో అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా 26 ఏళ్లుగా వైవాహిక బంధంలో కొనసాగుతున్న ఆమె ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే సెలబ్రిటీ టాక్‌ షోను నిర్వహిస్తున్నారు. ఈ షోకి తాజా ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా “వివాహానికి గడువు తేదీ, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?” అని ప్రశ్నించారు. దీనికి విక్కీ, కృతి, ట్వింకిల్ వద్దు అని సమాధానం చెప్పి రెడ్ జోన్‌లోకి వెళ్లారు. కాజోల్ మాత్రం ఊహించనివిధంగా అవును అంటూ సమాధానం చెప్పి గ్రీన్ జోన్‌లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వెంటనే ట్వింకిల్ ఖన్నా అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు కదా!” అంటూ చమత్కరించారు. దీనికి కాజోల్ బదులిస్తూ, తాను నిజంగానే అలా అనుకుంటున్నానని, మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు? గడువు ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఆ బంధానికి కొత్త అర్థం వస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారు. అదే షోలో డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా? అనే మరో ప్రశ్నకు కాజోల్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కోల్పోతాం అంటూ కాజోల్‌ బదులిచ్చారు. కార్యక్రమం చివర్లో ట్వింకిల్ సరదాగా.. బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి మాజీలతో డేటింగ్ చేయకూడదు అని కాజోల్‌ను ఆటపట్టించారు. దాంతో ఆమె నవ్వుతూ నోరు మూయ్! అంటూ ఫ్రెండ్లీగా హెచ్చరించారు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న ఈ షోకు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, అలియా భట్ వంటి ప్రముఖులు రాబోయే ఎపిసోడ్‌లలో పాల్గొననున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు… చిన్న పిల్లరా

Divvela Madhuri: బిగ్ బాస్‌ విన్నర్‌ ఎవరో చెప్పేసిన మాధురి

ప్రేమ విషయంలో మరో హింట్‌ ఇచ్చిన జాన్వీ

అంతర్జాతీయ జాబితాలో సౌత్ సినిమాల హవా.. అట్లుంటది మనతోని

డిఫరెంట్‌ స్ట్రాటజీస్ తో దూసుకుపోతున్న రష్మిక