సబ్ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా
సైబర్ నేరాల ఉధృతి పెరుగుతోంది. తాజాగా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌ను ACB అధికారులమని నమ్మించి సైబర్ నేరగాళ్లు లక్షల రూపాయలు మోసం చేశారు. బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఈ ఘటన, అధికారులు కూడా ఆన్‌లైన్ మోసాల బారిన పడుతున్నారని తేటతెల్లం చేస్తుంది. ఇటువంటి నకిలీ కాల్స్, బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
టెక్నాలజీ ఎంత వేగంగా డెవలప్ అవుతుందో అంతే వేగంగా సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త రూటులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఎవ్వరినీ వదలడంలేదు. సామాన్యుల నుంచి అధికారుల వరకు అందరినీ తమదైన శైలిలో మోసం చేస్తున్నారు. తాజాగా ఓ సబ్ రిజిస్ట్రార్‌ని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్ ను ఏసిబి అధికారులు మంటూ రెండు లక్షల కు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. తాము ఏసిబి అధికారులమని, విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ 8522010969 ఫోన్ నెంబర్ నుండి కాల్ చేసి, మీపై అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించిన పిర్యాదులు వచ్చాయని చెప్పారు . మీ కార్యాలయం పై ఏసిబి రైడ్‌కి వస్తున్నాం.. మీ అరెస్ట్ తప్పదు అంటూ బెదిరించారు. దీంతో భయపడిపోయిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ తనను వదిలేయాలంటూ వేడుకున్నాడు. దాంతో మీ ఆపీసుపై రైడ్ చేయకుండా ఉండాలంటే మూడు లక్షలు రూపాయిలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన సబ్ రిజిస్ట్రార్ వెంటనే నేరగాళ్లు ఇచ్చిన ఫోన్ నెంబర్ 8522010969 కు తన నెంబర్ నుండి లక్ష రూపాయలు , తన స్నేహితులైన ఆకాశం ప్రశాంత్ ,గుండు నాగేంద్ర కుమార్ ఫోన్ల నుండి మరో లక్ష రూపాయలు ఫోన్ పే చేసాడు . అయితే అక్కడితో ఆగని సైబర్ నేరగాళ్లు మరో లక్ష రూపాయలు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ కు అనుమానం వచ్చింది. ఏసీబీ అధికారులను సంప్రదించగా తాము అటువంటి కాల్స్ ఎవరికీ చేయమని ఎవరో మిమ్మల్ని మోసం చేశారని చెప్పారు . మోసపోయానని తెలుసుకున్న శ్రీనివాస్ పోలీసులను సంప్రదించి పిర్యాదు చేయతో మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరగాళ్లు ఇచ్చిన ఫోన్ నెంబర్ అకౌంట్ ను పరిశీలించగా అనంతపురం జిల్లా ఉరవకొండ SBI బ్రాంచ్ లో వడ్డే రామాంజనేయులు అనే వ్యక్తి అకౌంట్ గా గుర్తించారు. సైబర్ నేరగాళ్లు ఇటీవల రాష్ట్రంలో ఎక్కువ అవినీతి జరిగే ఆఫీసులను టార్గెట్ చేసి ఏసిబి అధికారులమంటూ కాల్ చేసి డబ్బులు ఇవ్వకపోతే మీపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం అని బెదిరించి లక్షలు దోచేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
180 కి.మీ స్పీడ్‌లో ‘వందేభారత్’ .. తొణకని గ్లాసులో నీరు
Karnataka Farmers: చెరుకు రైతుల అసహనం.. రోడ్డుపై బీభత్సం
రష్మికకు పబ్లిక్‌లోనే ముద్దుపెట్టేసిన రౌడీ హీరో
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

