AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో

వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో

Samatha J
|

Updated on: Nov 16, 2025 | 4:30 PM

Share

గుజరాత్‌ హైకోర్టులో ఓ విచిత్ర విడాకుల కేసు విచారణకు వచ్చింది. భార్య కుర్తా వేసుకుంటుందని, వీధి కుక్కలను ఇంటికి తీసుకొచ్చిందని అవి తనను కరిచాయని భర్త కోర్టుకు తెలిపాడు. దీనిపై న్యాయమూర్తులు వెంటనే కుక్కలు కరిచిన తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? అని అడిగారు. భర్త మరొక ఆసక్తికర ఆరోపణను కూడా చేశాడు. తన భార్య ఒక రేడియో జాకీతో కలిసి ప్రాంక్‌ చేసినట్లు తెలిపాడు.

ఆ ప్రాంక్‌లో భర్త తన కార్యాలయంలో మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే కథను కల్పించి అతన్ని భయపెట్టారని చెప్పాడు. దీనిపై భర్త పోలీసులతో కలిసి ఇంటికి వెళితే, అది ఏప్రిల్‌ ఫూల్‌ మాత్రమే అని తెలిసిందట. ఇలాంటి అర్థరహిత ప్రవర్తన వల్ల తనను అవమానించినట్లు భర్త వాదించాడు. భార్య ప్రవర్తన వల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని, కలిసి జీవించడం సాధ్యం కాదని చెబుతూ భర్త ముందుగా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఫ్యామిలీ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించడంతో ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో భరణంపై జరిగిన వాదనలు హాట్‌ టాపిక్‌గా మారాయి. విడాకులు ఇవ్వాల్సి వస్తే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఒకటి మొత్తంగా చెల్లిస్తానని భర్త కోర్టుకు తెలిపాడు. అయితే భార్య మాత్రం రూ.2 కోట్లు భరణంగా కావాలని కోర్టును కోరింది.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో