ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
వేలకు వేలు ధర పెట్టి కొన్న మొబైల్ ఫోన్లు ఎందుకు పేలిపోతున్నాయి? పేలిపోవడమే కాదు ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టిన సమయంలోనే ఫోన్లు పేలిన సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఛార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీకి ఎటువంటి ఇబ్బందులు రావంటున్నారు నిపుణులు. సాధారణంగా ప్రస్తుతం ఫోన్లకు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టినా ప్రమాదం ఉండదు. ఎందుకంటే బ్యాటరీ వంద శాతం ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్ దానంతట అదే ఆగిపోతుంది. ప్రస్తుతం తయారవుతున్న ఫోన్లలో బ్యాటరీలు సామర్థ్యానికి మించి ఛార్జ్ కాకుండా ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఒకవేళ రాత్రి ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలాగే వదిలేయాలనుకుంటే పౌచ్‌లో నుంచి బయటికి తీసి ఛార్జింగ్ పెట్టడం మంచిది.
ఫోన్ ఛార్జ్ చేసేందుకు ఉపయోగించేది కంపెనీ ఛార్జర్ అయితే చాలా మంచిది. నాసిరకం ఛార్జర్ ఉపయోగిస్తే ఫోన్ లేదా ఛార్జర్ కాలిపోయే ప్రమాదం ఉంది. కంపెనీ ఇచ్చే ఛార్జర్లను అనేక రకాలుగా పరీక్షించి ఆమోదముద్ర వేస్తుంది. వాటితో ప్రమాదం ఉండదు. ఫోన్లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటే ..తక్కువ సమయం ఎక్కువసార్లు ఛార్జ్ చేసుకున్నా సరిపోతుంది. తప్పని పరిస్థితుల్లో సాధారణ ఛార్జర్లు ఉపయోగించాల్సి వస్తే.. వాటితో వంద శాతం ఛార్జ్ చేయకపోవడం మంచిది. బ్యాటరీ చివరి 20శాతం ఛార్జ్ అయ్యేప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ సమయంలోపేలిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
