మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
అనకాపల్లిలో రూ.16 లక్షల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు లాటరీ పేరుతో ఓటీపీ అడిగి బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. వాడుకలో లేని ఖాతాలతో పాటు, కొందరు బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. విశాఖ, తెలంగాణలో అరెస్టులు జరిగాయి. మీ ఖాతా భద్రతకు అప్రమత్తంగా ఉండాలి.
అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి నేరగాళ్లు విడతల వారీగా 16 లక్షల రూపాయలు దోచేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తులో నగదు విదేశీ కరెన్సీగా మార్చబడినట్లు తేలింది. సైబర్ నేరగాళ్లు తమ మోసపూరిత పద్ధతులలో కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ముందుగా కొన్ని ఖాతాల్లో రూ.10,000 నుంచి రూ.20,000 వరకు జమ చేస్తారు. అనంతరం బాధితులకు ఫోన్ చేసి, లాటరీ తగిలిందని, మీ ఖాతాలో నగదు జమ చేశామని నమ్మిస్తారు. అటుపై ఓటీపీ చెప్పమని కోరుతారు. నేరగాళ్ల మాటలు విని ఓటీపీ చెప్పినట్లయితే, మీ బ్యాంక్ ఖాతాకు నేరగాళ్లు పూర్తి యాక్సెస్ పొందుతారు.
మరిన్ని వీడియోల కోసం :
వైరల్ వీడియోలు
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
