అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అతివేగం ప్రమాదకరమని ఎంత చెప్పినా కొందరు పెడచెవిన పెడుతుంటారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. వారితో పాటుగా ఇతరులను ప్రమాదాల్లో పడేస్తారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో జరిగింది. ఓ యువతి మద్యం సేవించి వాహనం నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫిలిమ్ నగర్ పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా ఒక్క సారిగా అవాక్కయ్యారు. యువతి మద్యం మత్తులో కారు నడిపినట్లు గుర్తించారు.డ్రైటులో యువతి ఇరుక్కుపోయి ఉండటంతో కారు అద్దాలు పగులగొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆమెకు పెనుప్రమాదం తప్పింది. ప్రమాదంతో షాక్ కు గురైన ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వైరల్ వీడియోలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
