AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సారూ.. కాస్త ‘వైఫ్‌’ని వెతికి పెట్టరూ..? వీడియో

సారూ.. కాస్త ‘వైఫ్‌’ని వెతికి పెట్టరూ..? వీడియో

Samatha J
|

Updated on: Nov 16, 2025 | 11:05 AM

Share

మహారాష్ట్రలోని విదర్బ ప్రాంత యువ రైతు తనకు పెళ్లి కావడం లేదంటూ ఎన్‌సీపీ నేత శరద్ పవార్ కు లేఖ రాశాడు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు 34 ఏళ్లని, ఇప్పట్లో తనకు పెళ్లి కాదేమోనని దిగులు పడుతున్నట్లు రాసుకొచ్చాడు యువ రైతు. ‘నేను మిమ్మల్ని రుణం ఇప్పించాలని అడగడం లేదు. జాబ్ కోసం కూడా ఈ లేఖ రాయడం లేదు.. వయసు మించి పోతుంది. ఇంట్లో ఒంటరిగా ఉండలేక పోతున్నా. జీవిత భాగస్వామి ఎంపికలో సహకరించండి’ అని ఆ యువ రైతు లేఖలో విజ్ఞప్తి చేసాడు.

పది సంవత్సరాలు కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసిన అనుభవం శరద్‌ పవార్‌ సొంతం. ఇటీవల శరద్ పవార్ అకోలా జిల్లా పర్యటన సందర్భంగా అతనికి స్వయంగా లేఖ అందించాడు. తాను కష్టపడి పని చేస్తానని, మంచి భర్తగా ఉంటానని రాసాడు. అవసరమైతే ఇల్లరికం కూడా వెళ్లడానికి సిద్ధమేనని స్పష్టం చేశాడు. తనకు కాబోయే భార్య కులం, మతం పట్టింపులు లేవని అన్నాడు. మహారాష్ట్రలోని విదర్భ బాగా వెనకబడిన ప్రాంతం. నీటి వనరులు లేక బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కరువు ప్రాంతంగా పేరొందిన విదర్భలో ప్రజల జీవన స్థితిగతులు దయనీయం. తనకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని యువ రైతు లేఖలో తన గోడును వెళ్లబోసుకున్నాడు.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో

Published on: Nov 16, 2025 08:48 AM