COVID-19 vaccine: వైద్య సిబ్బంది నిర్వాకం.. యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా.. ఆ తర్వాత ఏమైందంటే?

Coronavirus vaccine - Pfizer-BioNTech: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో అన్ని దేశాల్లో వ్యాక్సినేసన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మినహా.. మిగతా వ్యాక్సిన్లన్నింటినీ రెండు డోసుల

COVID-19 vaccine: వైద్య సిబ్బంది నిర్వాకం.. యువతికి ఒకేసారి ఆరు డోసుల టీకా.. ఆ తర్వాత ఏమైందంటే?
COVID-19 vaccine
Follow us

|

Updated on: May 11, 2021 | 2:29 PM

Coronavirus vaccine – Pfizer-BioNTech: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో అన్ని దేశాల్లో వ్యాక్సినేసన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మినహా.. మిగతా వ్యాక్సిన్లన్నింటినీ రెండు డోసుల చొప్పున వేస్తున్నారు. అయితే ఒక్కో డోసుకు కనీసం నెల వ్యత్యాసంతో ఇస్తున్నారు. అయితే ఇటలీలో ఓ యువతికి పొరపాటున ఒకేసారి ఏకంగా ఆరు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత గమనించిన సిబ్బంది ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ఈ సంఘటన ఇటలీలోని టుస్కనీ నోవా ఆసుపత్రిలో ఆదివారం జరిగింది. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన 23 ఏళ్ల యువతికి పొరపాటున ఆరు డోసులు వేసినట్టు నోవా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

ఆరు డోసులుండే ఫైజర్ వ్యాక్సిన్ వయల్ మొత్తాన్ని ఆరోగ్య కార్యకర్త సిరంజీలోకి లోడ్ చేశారని.. అది పొరపాటుగానే జరిగిందంటూ ప్రతినిధి వెల్లడించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత పక్కనే ఇంకా వాడని ఐదు సిరంజీలు ఉండడం, వయల్ ఖాళీ కావడంతో తన పొరపాటును ఆరోగ్య కార్యకర్త గుర్తించి చెప్పారని తెలిపారు. వ్యాక్సిన్ ఓవర్ డోస్ కావడంతో వెంటనే ఆమెను పర్యవేక్షణలో ఉంచామని, 24 గంటల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించామని నోవా ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉండడంతో సోమవారం ఇంటికి పంపించామని పేర్కొన్నారు.

ఆ యువతి ఆసుపత్రిలోని సైకాలజీ విభాగంలో ఇంటర్న్ అని వెల్లడించారు. ఇది కావాలని చేసింది కాదని, మానవ తప్పిదమేనని వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై అధికారులు విచారిస్తున్నారు. ఇదిలాఉంటే.. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం నాటినుంచి ఇటలీలో సోమవారం వరకు 41 లక్షల కోవిడ్ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,23,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Corona Virus: కోవిడ్ పోరులో ముందుకు వచ్చిన ట్విట్టర్.. భారత్‏కు భారీగా విరాళం ప్రకటించిన సంస్థ..

ఉత్తర కొరియాలో జీరో కొవిడ్ కేసులు..! అనుమానం వ్యక్తం చేస్తున్న ఆరోగ్య నిపుణులు.. కిమ్ ఏం చెబుతున్నాడంటే..?