Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తర కొరియాలో జీరో కొవిడ్ కేసులు..! అనుమానం వ్యక్తం చేస్తున్న ఆరోగ్య నిపుణులు.. కిమ్ ఏం చెబుతున్నాడంటే..?

Zero Covid Cases in North Korea : కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని

ఉత్తర కొరియాలో జీరో కొవిడ్ కేసులు..! అనుమానం వ్యక్తం చేస్తున్న ఆరోగ్య నిపుణులు.. కిమ్ ఏం చెబుతున్నాడంటే..?
North Korea
Follow us
uppula Raju

|

Updated on: May 11, 2021 | 9:35 AM

Zero Covid Cases in North Korea : కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంటే తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని చెబుతోంది ఉత్తర కొరియా. అయితే ఇది నిజమా.. అబద్దమా అని ఆరోగ్య నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరోనావైరస్ కోసం ఏప్రిల్ నాటికి 25,986 మందిని పరీక్షించామని ఉత్తర కొరియా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. ఇంకా ఒక్క ఇన్ఫెక్షన్ కూడా కనుగొనబడలేదని స్పష్టం చేసింది.

ఉత్తర కొరియా పరీక్షా గణాంకాలలో ఏప్రిల్ 23-29 మధ్య జరిపిన పరీక్షల్లో 751 మంది ఉన్నారు. వీరిలో139 మందికి ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యాలు లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ పర్యవేక్షణ నివేదికలో తెలిపింది. COVID-19 కేసులు నమోదుకాకపోవడంతో ఉత్తర కొరియా నిజంగానే ఖచ్చితమైన రికార్డును కలిగి ఉందా అని నిపుణులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా తన వైరస్ నిరోధక ప్రయత్నాలను “జాతీయ ఉనికికి సంబంధించినది” గా అభివర్ణించింది. ఇది పర్యాటకులను నిరోధించింది. దౌత్యవేత్తలను బయటకు పంపించింది. సరిహద్దు ట్రాఫిక్, వాణిజ్యాన్ని తీవ్రంగా పరిమితం చేసింది. ఈ సంవత్సరం నిర్బంధించే వ్యక్తుల సంఖ్యను ఆపివేసింది. కానీ గతంలో లక్షణాలను ప్రదర్శించిన పదివేల మందిని నిర్బంధించినట్లు తెలిసింది.

కొవాక్స్ కార్యక్రమం ద్వారా ఉత్తర కొరియాకు ఈ ఏడాది ద్వితీయార్థంలో 1.9 మిలియన్ల వ్యాక్సిన్లు అందుతాయని ఐరాస ఫిబ్రవరిలో ప్రకటించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరగడం, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ భారత్​లో అవసరాల మేరకే సరఫరా చేస్తుండటం వల్ల టీకాల కొరత ఏర్పడిందని తెలిపింది. రొడోంగ్ సిన్మన్​ లో ప్రచురించిన కథనంలో భారత్ పేరును ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేసింది ఉత్తర కొరియా ప్రభుత్వం. కరోనా వైరస్​పై గెలిచామని భావించి విదేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసి, ఆంక్షల్ని సడలించిన ఓ దేశంలో ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది ఉత్తరకొరియా ప్రభుత్వం.

Pawan Kalyan: ఆ దుస్థితి వల్లే ఈ విషాదం.. తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..

Gas Cylinder Booking: వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ పై రూ.800 వరకు తగ్గింపు.!! ఎలాగంటే.!