Pawan Kalyan: ఆ దుస్థితి వల్లే ఈ విషాదం.. తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..

Tirupati Ruia Hospital - pawan kalyan: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్‌ ఐదు నిమిషాలు

Pawan Kalyan: ఆ దుస్థితి వల్లే ఈ విషాదం.. తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి..
Pawan
Follow us

|

Updated on: May 11, 2021 | 9:38 AM

Tirupati Ruia Hospital – pawan kalyan: ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి 11 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘోరం జరిగింది. అయితే.. వెంటిలేటర్‌పై ఉన్న బాధితులు మాత్రమే చనిపోగా మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉంది. కాగా.. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని వెల్లడించారు. ఊపిరి అందించే వాయువుని సక్రమంగా అందించని దుస్థితి నెలకొనడం వల్లే ఈ విషాదకర ఘటన చోటు చేసుకొందన్నారు. రాయలసీమ ప్రజల వైద్య అవసరాలకు కేంద్రమైన రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా, వైద్యపరమైన మౌలిక వసతులు సరిగా లేవని రోగులు ఎంతో ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారని.. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు, హిందూపురంల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రోగులు ఆక్సిజన్ సరఫరా అందక చనిపోయారని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోలేదన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదని సంయమనం పాటిస్తున్నామంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశఆరు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి విషాదకర ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.

Also Read:

Oxygen Shortage: తిరుపతిలో ఘోరం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి

Corona Vaccine: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ వివాదం..స్పందించిన ప్రభుత్వం..రాష్ట్రానికి వచ్చిన టీకాల లెక్కలు ఇవే!