బ్యాంకులకు, ప్రభుత్వానికి టోపీ పెట్టి ఖరీదైన కార్లు కొన్న అమెరికన్, అక్కడా ‘అభినవ నీరవ్ మోడీలు ‘ ఉన్నట్టేనా ?

అమెరికాలోనూ అభినవ 'భారత నీరవ్ మోడీలు' ఉన్నట్టే ఉన్నారు. కాలిఫోర్నియాలో ఓ 'పెద్దమనిషి' ప్రభుత్వాన్ని, బ్యాంకులను మోసగించి ఆ సొమ్ముతో ఖరీదైన కార్లను కొన్నాడు.

  • Publish Date - 3:10 pm, Tue, 11 May 21 Edited By: Phani CH
బ్యాంకులకు, ప్రభుత్వానికి టోపీ పెట్టి ఖరీదైన కార్లు కొన్న అమెరికన్, అక్కడా 'అభినవ నీరవ్ మోడీలు ' ఉన్నట్టేనా ?
California Man Buys Ferrari Car

అమెరికాలోనూ అభినవ ‘భారత నీరవ్ మోడీలు’ ఉన్నట్టే ఉన్నారు. కాలిఫోర్నియాలో ఓ ‘పెద్దమనిషి’ ప్రభుత్వాన్ని, బ్యాంకులను మోసగించి ఆ సొమ్ముతో ఖరీదైన కార్లను కొన్నాడు. జల్సాగా విదేశీ లొకేషన్లకు షికార్లు చేశాడు. ముస్తఫా ఖాద్రి అనే ఇతడ్ని గతవారం పోలీసులు అరెస్టు చేశారు. కోవిద్ పాండమిక్ కారణంగా ఉపాధి కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న చిన్న వ్యాపారులకు, ఇతర బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం కేటాయించిన సహాయంలో ఇతగాడు 50 లక్షల కోవిడ్ రిలీఫ్ ఫండ్ ను తన స్వప్రయోజనాలకు వినియోగించుకున్నాడు. ఫెరారీ, లాంబోర్గినీ వంటి లగ్జరీ కార్లు కొన్నాడు. యూఎస్ ప్రభుత్వం పే చెక్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రాం కింద కోవిడ్ బాధితుల సహాయార్థం కోట్లాది డాలర్లను విడుదల చేసింది. అయితే ఖాద్రి బోగస్ కంపెనీల పేరిట బ్యాంకుల్లో లక్షలాది రుణాలు తీసుకున్నాడు. ఫోర్జరీ చేసిన చెక్కులు, ఫేక్ టాక్స్ రిటర్నులు తదితరాలను సమర్పించి మూడు పెద్ద బ్యాంకులను ఛీట్ చేశాడు. మొత్తం 50 లక్షల డాలర్లను తన జేబులో వేసుకున్నాడు., చివరకు ఇతని మోసం వెలుగులోఇకి వచ్చింది. ఇతడి నుంచి ఖరీదైన కార్లను, ఇతని బ్యాంకు ఖాతాల నుంచి 20 లక్షల డాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా ఇలాంటి ఘనులు చాలామందే ఉన్నారని, సుమారు 11 బిలియన్ డాలర్ల సోమ్మును వారు నొక్కేశారని అధికారులు చెబుతున్నారు.

కాగా తాను నిర్దోషినని, తనకేమీ తెలియదని ఖాద్రి అమాయకంగా చెప్పాడు. కానీ ఇతని వాదనను కోర్టు నమ్మలేదు. 10 లక్షల డాలర్ల బాండ్ పై కోర్టు ఇతనిని విడుదల చేసింది. అటు.ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లకు కోర్టు సూచించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:  Ruya Hospital: రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబాల‌కు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్

Telangana Cabinet Live: తెలంగాణ‌లో రేప‌టి నుంచి లాక్‌డౌన్‌.. కేవ‌లం నాలుగు గంట‌లు మాత్రమే స‌డ‌లింపు..