Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Air Strikes:యెమెన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్… ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వార్‌ యెమెన్‌ వైపు మళ్లింది. మొన్నటి వరకు ఇరాన్‌ టార్గెట్‌గా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌ తాజాగా యెమోన్‌పై విరుచుకుపడింది. ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సామాన్య పౌరులను ఖాళీ చేయాల్సిందిగా ముందస్తు...

Israel Air Strikes:యెమెన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్... ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్
Israel Air Strikes
K Sammaiah
|

Updated on: Jul 07, 2025 | 6:46 AM

Share

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వార్‌ యెమెన్‌ వైపు మళ్లింది. మొన్నటి వరకు ఇరాన్‌ టార్గెట్‌గా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌ తాజాగా యెమోన్‌పై విరుచుకుపడింది. ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సామాన్య పౌరులను ఖాళీ చేయాల్సిందిగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం 50 చోట్ల ఇజ్రాయెల్‌ బాంబు దాడులు చేసింది. యెమెన్‌లోని హొదెదా పోర్ట్ లక్ష్యంగా దాడులు జరిపింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలు టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ బాంబులు కురిపించింది.

యెమెన్‌లోని హౌతీ నియంత్రణలోని హుదయ్‌దా, రాస్ ఇసా, సైఫ్‌ ఓడరేవులపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. హౌతీల మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ఈ దాడి చేసింది. యెమెన్‌పై ఎటాక్‌కి ఇజ్రాయెల్‌ పెట్టిన పేరు ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్. హౌతీల నియంత్రణలోని రాస్ కనాటిబ్ విద్యుత్ కేంద్రం, 2023లో హౌతీలు స్వాధీనం చేసుకున్న గెలాక్సీ లీడర్ ఓడని ఇజ్రాయెల్‌ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. గెలాక్సీ లీడర్ షిప్‌ని హౌతీలు అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నౌకలను గమనించడానికి రాడార్ సిస్టమ్‌గా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్.

దాడులకు ముందు హుదయ్‌దా, రాస్ ఇసా, సైఫ్ ఓడరేవుల్లోని పౌరులను ఆ ప్రాంతం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు చేసింది. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఇజ్రాయెల్‌పై మిసైల్‌ దాడులకు దిగారు. దీంతో ఇజ్రాయెల్‌ హౌతీ స్థావరాలపై గురిపెట్టింది.

యెమెన్‌లో మిలియన్ల మందికి ఆహారం, మానవతా సాయం కోసం హుదయ్‌దా ఓడరేవు ప్రధాన ఎంట్రీ పాయింట్‌గా ఉంది. ఏడాది కాలంలో ఇజ్రాయెల్‌ పలుమార్లు ఈ పోర్ట్‌పై దాడి చేసింది. మే, జూన్‌లో ఇజ్రాయెల్ హుదయ్‌దాపై ఓడరేవుపై దాడులు చేసింది.