Sudan Clash: అట్టుడుకుతున్న సుడాన్.. కాల్పుల్లో భారతీయుడు మృతి

ఆఫ్రికా దేశమైన సూడాన్ మరోసారి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో ఇరు వర్గాలు బాంబుల దాడులు, కాల్పులకు పాల్పడ్డారు.

Sudan Clash: అట్టుడుకుతున్న సుడాన్.. కాల్పుల్లో భారతీయుడు మృతి
Sudan
Follow us
Aravind B

|

Updated on: Apr 16, 2023 | 1:00 PM

ఆఫ్రికా దేశమైన సూడాన్ మరోసారి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో ఇరు వర్గాలు బాంబుల దాడులు, కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సూడన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ భారతీయలను హెచ్చరించింది. ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఎవ్వరూ బయటకు రావద్దని హెచ్చరించింది. అయితే నిన్న జరిగిన కాల్పుల్లో దాల్.. గ్రూప్ లో పనిచేస్తున్న అల్బర్ట్ ఆగస్టీన్ అనే భారతీయుడు చనిపోయినట్లు తెలిపింది. తదుపరి ఏర్పాట్లు చేయడానికి అతని కుటుంబ సభ్యులు, వైద్య అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉండగా సూడాన్‌లోని పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే దీనిపై సైన్యాధినేత అబ్దెల్‌ ఫతా అల్‌ బుర్హాన్‌, పారామిలిటరీ కమాండర్ మహ్మద్‌ హందాన్‌ డగ్లో మధ్య కొన్ని వారాలుగా విభేదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం.. విభేదాలు తీవ్రతరం అవ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో, సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 56 మంది చనిపోయారు.  మరోవైపు సూడాన్‌ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!