AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gina Raimondo: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు.. ప్రధాని మోదీపై అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ప్రశంసలు..

ప్రధాని మోదీకి టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో అన్నారు. తాను మోదీతో రేడియో యాక్సెస్, కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడినట్లుగా తెలిపారు.

Gina Raimondo: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు.. ప్రధాని మోదీపై అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ప్రశంసలు..
Us Commerce Secretary Gina Raimondo
Sanjay Kasula
|

Updated on: Apr 16, 2023 | 11:47 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ప్రశంసల వర్షం కురిపించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని.. ఇలాంటి నాయకుడిని తాను ఇంతవరకు చూడలేదన్నారు. గత నెల (మార్చి 7, మార్చి 10 మధ్య) భారతదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం (ఏప్రిల్ 15) అమెరికాలోని ఇండియా హౌస్‌లో జరిగిన రిసెప్షన్‌లో గినా రైమోండో మాట్లాడుతూ, తాను ప్రధాని మోదీతో 1 గంటకు పైగా సమావేశం అయినట్లుగా తెలిపారు. ఈ సమయం చాలా అద్భుతమైనదని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీకి చాలా భిన్నమైన ప్రత్యేకత ఉందని.. అది ఆయనను ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలబెట్టిందని గినా రైమోండో చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ చాలా దూరంగా ఆలోచిస్తున్నారని గినా రైమోండో అన్నారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజల పట్ల అతని నిబద్ధత స్థాయి చాలా గొప్పగా ఉందన్నారు. ఇది వర్ణించడం కూడా చలా కష్టం. భారతదేశ ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడంలో.. భారత దేశాన్ని ప్రపంచ శక్తిగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ సంకల్ప శక్తి నిజమైనదని అన్నారు. ఇదే కోణంలో ప్రధాని మోదీ పనితీరు ఉందని.. నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

‘టెక్నాలజీతో ప్రధాని మోదీకి ఉన్న అనుబంధం’ – గినా రైమోండో

ప్రధాని మోదీ గురించి అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో మాట్లాడుతూ తనకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని అన్నారు. ప్రధాని మోదీ టెక్నాలజీ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడతారని తెలిసిన వారికి తెలుసు.. అతను టెక్నాలజీకి సంబంధించిన ప్రతి అంశంపై చాలా శ్రద్ధ చూపుతారు.

రేడియో యాక్సెస్, కృత్రిమ మేధస్సు గురించి తాను ప్రధాని మోదీతో మాట్లాడినట్లుగా తెలిపారు. రానున్న కాలంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్, అమెరికాలు శాసించనున్నాయని అన్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదని.. AI అంటే.. అమెరికా- ఇండియా సాంకేతిక పర్యావరణ వ్యవస్థ అని ప్రధాని తనతో చెప్పారని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో తెలిపారు.

గినా రైమోండో అనేక మంది నాయకులను కలుసుకున్నారు

భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవడమే కాకుండా పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు పలువురు మంత్రులను కూడా కలిశారు US వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో. అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో, పీయూష్ గోయల్ సంయుక్తంగా ఇండియా-యుఎస్ వాణిజ్యం అనే అంశంపై మీడియా సమావేశంలో ప్రసంగించారు.

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా