AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China: చైనా, హాంకాంగ్ కంపెనీలపై అమెరికా ఆంక్షల వేటు..చైనా ఆగ్రహం

రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపిస్తూ అయిదు హాంకాంగ్, చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై చైనా శనివారం తీవ్రంగా ఖండించింది. రష్యా ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూపునకు ఉక్రెయిన్‌పై అంతరిక్ష ఉపగ్రహ చిత్రాలను అందించిందని గత ఫిబ్రవరిలో స్పేస్టీ చైనా అనే సంస్థపై కూడా అమెరికా ఆంక్షలు వేటు వేసింది.

China: చైనా, హాంకాంగ్ కంపెనీలపై అమెరికా ఆంక్షల వేటు..చైనా ఆగ్రహం
China And Amrican Flags
Aravind B
|

Updated on: Apr 16, 2023 | 1:58 PM

Share

రష్యాతో వ్యాపారం చేస్తున్నాయని ఆరోపిస్తూ అయిదు హాంకాంగ్, చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై చైనా శనివారం తీవ్రంగా ఖండించింది. రష్యా ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూపునకు ఉక్రెయిన్‌పై అంతరిక్ష ఉపగ్రహ చిత్రాలను అందించిందని గత ఫిబ్రవరిలో స్పేస్టీ చైనా అనే సంస్థపై కూడా అమెరికా ఆంక్షలు వేటు వేసింది. అప్పట్లో ఈ వ్యవహారంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు చైనాతోపాటు మాల్టా, తుర్కియే, సింగపూర్‌ తదితర దేశాలకు చెందిన 28 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.

అయితే ఈ కంపెనీలన్నీ రష్యాతో గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా వ్యాపారం చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించడానికి ఈ లావాదేవీలు రష్యాకు సహాయపడుతున్నాయని చెబుతోంది. రష్యాతో వ్యాపారం చేస్తారా లేక అమెరికాతో చేస్తా అన్నది ఆ కంపెనీలు తేల్చుకోవాల్సి ఉంటుంది. అమెరికా ఆంక్షలు విధించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కంపెనీలపై ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమనీ చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. అమెరికా తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..