Indian Fishermen: పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన మనదేశ మత్స్యకారులు.. ఇప్పటికీ అక్కడి జైలులో వందల మంది భారతీయులు!

 పాకిస్తాన్ తన చెరలో ఉన్న 20 మంది మత్స్యకారులను విడుదల చేసింది. వారు అందరూ సోమవారం అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు.

Indian Fishermen: పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన మనదేశ మత్స్యకారులు.. ఇప్పటికీ అక్కడి జైలులో వందల మంది భారతీయులు!
Indian Fishermen
Follow us

|

Updated on: Nov 16, 2021 | 9:26 AM

Indian Fishermen: పాకిస్తాన్ తన చెరలో ఉన్న 20 మంది మత్స్యకారులను విడుదల చేసింది. వారు అందరూ సోమవారం అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. సముద్రంలో తమను పాకిస్తాన్ బందీలుగా పట్టుకుందని వారు చెప్పారు. తాము గత 4 ఏళ్లుగా లాంధీ జైల్లో ఉన్నామని ఓ మత్స్యకారుడు చెప్పాడు. జైల్లో ఉన్న సమయంలో తమ కుటుంబాలకు 9000 రూపాయలు అందించినందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. జాలర్ల జాతీయతను భారత అధికారులు ధృవీకరించిన తర్వాత సద్భావన సూచనగా మత్స్యకారులను విడుదల చేసినట్లు లాంధీ జైలు సూపరింటెండెంట్ ఇర్షాద్ షా తెలిపారు. ఈ మత్స్యకారులు నాలుగేళ్లపాటు జైలు జీవితం గడిపారని, పాకిస్తాన్ ప్రభుత్వం గుడ్‌విల్‌గా ఆదివారం విడుదల చేసినట్లు ఇర్షాద్ షా తెలిపారు. లాహోర్‌లోని వాఘా సరిహద్దుకు మత్స్యకారులను తీసుకెళ్లేందుకు లాభాపేక్షలేని సాంఘిక సంక్షేమ సంస్థ ఈధి ట్రస్ట్ ఫౌండేషన్ ఏర్పాట్లు చేసింది.

ప్రస్తుతం ఎంత మంది భారతీయులు పాక్ జైలులో ఉన్నారు?

ఇప్పటికీ లాంధీ జైలులో 588 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది మత్స్యకారులేనని అధికారి ఇర్షాద్ షా తెలిపారు. సింధ్ హోం శాఖ నుంచి అనుమతి లభించిన తర్వాత వాటిని విడుదల చేస్తామన్నారు. పాకిస్తాన్ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నందుకు గాను మత్స్యకారులను పాకిస్తాన్ సముద్ర భద్రతా దళం (పీఎంఎస్‌ఎఫ్) అరెస్టు చేసి డాక్ పోలీసులకు అప్పగించారు. పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది ప్రారంభంలో 20 మంది భారతీయ మత్స్యకారులను మరియు 2019 ఏప్రిల్‌లో మరో 100 మంది భారతీయ మత్స్యకారులను సద్భావన సూచనగా విడుదల చేసింది.

రెండు దేశాల మధ్య అరేబియా సముద్ర తీరంలో స్పష్టమైన సరిహద్దు రేఖ లేకపోవడంతో ఆధునిక నావిగేషన్ పరికరాలు లేని ఈ మత్స్యకారులు పొరపాటున రెడ్‌లైన్‌ను దాటుతున్నారని ఎన్జీవో పాకిస్తాన్ ఫిషర్మెన్ ఫోరమ్ సీనియర్ అధికారి తెలిపారు. ఇలా పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన వారిని జైళ్లలో పెడతారు.

ఇవి కూడా చదవండి: Viral News: కండోమ్‌ కొనండి.. కారు సొంతం చేసుకోండి.. విచిత్రమైన పబ్లిసిటీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..