China: సముద్రం నుంచి అంతరిక్షంలోకి రాకెట్లు ప్రయోగించే వేదిక సిద్ధం చేస్తున్న చైనా..

రాకెట్లను ప్రయోగించి, ఉపగ్రహాల దిశలను మార్చే సామర్థ్యాన్ని చైనా పెంచుకోవాలనుకుంటోంది. ఈ దిశలో, చైనా ప్రత్యేకంగా ఒక షిప్ ను రూపొందిస్తోంది. దీని ద్వారా సముద్రం నుండి అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించవచ్చు.

China: సముద్రం నుంచి అంతరిక్షంలోకి రాకెట్లు ప్రయోగించే వేదిక సిద్ధం చేస్తున్న చైనా..
China Rocket Launching Ship
Follow us

|

Updated on: Nov 16, 2021 | 9:47 AM

China: రాకెట్లను ప్రయోగించి, ఉపగ్రహాల దిశలను మార్చే సామర్థ్యాన్ని చైనా పెంచుకోవాలనుకుంటోంది. ఈ దిశలో, చైనా ప్రత్యేకంగా ఒక షిప్ ను రూపొందిస్తోంది. దీని ద్వారా సముద్రం నుండి అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించవచ్చు. చైనా సిద్ధం చేస్తున్న ఈ ‘న్యూ-టైప్ రాకెట్ లాంచింగ్ షిప్’ 533 ft (162.5 m) పొడవు, 131 ft (40 m) వెడల్పుతో ఉంటుంది. దీనిని తూర్పు తీరంలో షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హైయాంగ్‌లోని కొత్త చైనా ఓరియంటల్ స్పేస్‌పోర్ట్‌లో నిర్మించారు.

ఈ కొత్త నౌక 2022లో చైనా నావికాదళ సేవలో చేరనుంది. ఇది ఇంటిగ్రేటెడ్ లాంచ్ సపోర్ట్ పరికరాలను కలిగి ఉంటుంది. ఈ షిప్ ద్వారా ఒకేసారి 11 రాకెట్లు, పెద్ద వాణిజ్య స్మార్ట్ డ్రాగన్ రాకెట్లు , లిక్విడ్ ప్రొపెల్లెంట్ రాకెట్లను ప్రయోగించవచ్చు. భవిష్యత్తులో రాకెట్ మొదటి దశను సిద్ధంచేసి ప్రయోగాత్మకంగా పరిశీలించే అవకాశం ఉంది. ఇది ఫాల్కన్ 9, ఫాల్కన్ హెవీ రాకెట్‌ల మొదటి దశ ల్యాండింగ్‌కు వేదికను అందించడం ద్వారా SpaceX స్పేస్‌పోర్ట్ డ్రోన్ షిప్‌ల మాదిరిగానే పని చేస్తుంది. రాకెట్ దిగువ భాగాన్ని మొదటి దశ అని పిలుస్తారు. ఇది సాధారణంగా అతిపెద్దది. రాకెట్‌ని ఎత్తుకు తీసుకెళ్లడమే దీని పని.

మూడో దేశంగా చైనా..

సముద్రం నుండి రాకెట్లను ప్రయోగించే దిశలో చైనా ఇప్పటికే రెండు సముద్ర ప్రయోగాలను నిర్వహించింది. ఇందులో తాజాది సెప్టెంబర్ 2020లో జరిగింది. ఈ మిషన్లు యూఎస్, రష్యా తర్వాత సముద్ర ప్రయోగ సామర్థ్యాన్ని కలిగి ఉన్న మూడవ దేశంగా చైనాను చేశాయి. చైనా ప్రధాన అంతరిక్ష కాంట్రాక్టర్ సంవత్సరం ప్రారంభంలో రెండు నుంచి మూడు సముద్ర ప్రయోగాలను ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే ఇది ఇంకా పూర్తి కాలేదు. దీనికి కారణం కొత్త షిప్ కోసం ప్రణాళిక లేదా మరోక కారణం ఏదైనా ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

దీనివలన ప్రయోజనం ఏమిటి?

సముద్రం నుండి ప్రయోగ రేటును పెంచడానికి ఈ నౌక చైనాకు సహాయం చేస్తుంది. దీని వల్ల చైనాకు చెందిన నాలుగు ప్రధాన ప్రయోగ కేంద్రాలపై కూడా ఒత్తిడి తగ్గనుంది. ఇప్పటివరకు, 2021లో చైనా 41 సార్లు ప్రయోగించింది. ఇలా ఏడాది వ్యవధిలో జాతీయ రికార్డు కూడా సృష్టించింది. అదే సమయంలో, అమెరికా ఇప్పటివరకు 39 మాత్రమే ప్రారంభించింది. సముద్రం నుంచి ప్రయోగించడం వల్ల చైనాకు ఎంతో మేలు జరగనుంది. వాస్తవానికి, లాంచ్ సైట్ సౌలభ్యం కారణంగా, అంతరిక్షంలోకి వెళ్లడానికి మరొక మార్గం ఉంటుంది, దీనిని ఎవరూ ఉపయోగించలేదు. అదే సమయంలో, రాకెట్ దశ, ఇతర శిధిలాలు నేలపై పడకుండా సముద్రంలో పడటం ఉండటం కూడా దీనికి ఉన్న అదనపు ప్రయోజనం.

ఇవి కూడా చదవండి: Viral News: కండోమ్‌ కొనండి.. కారు సొంతం చేసుకోండి.. విచిత్రమైన పబ్లిసిటీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..