పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

పాపులారిటీ సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించాలంటే చాలానే కష్టపడాలి. ఇక ఒక్కసారి క్రేజ్ వచ్చిందంటే చాలు అభిమానులు అమాంతం పరిగిపోతారు.

Rajeev Rayala

|

Nov 16, 2021 | 6:45 AM

పాపులారిటీ సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించాలంటే చాలానే కష్టపడాలి. ఇక ఒక్కసారి క్రేజ్ వచ్చిందంటే చాలు అభిమానులు అమాంతం పరిగిపోతారు. ఇక హీరోయిన్స్, యాంకర్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటాయి. ఆ ఫోటోలను, వీడియోలను అభిమానులు చాలా పదిలంగా దాచుకుంటూఉంటారు. అంతే కాదు తమ అభిమాన హీరోయిన్స్, యాంకర్స్ చిన్ననాటి ఫోటోలను కూడా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. తాజా ఓ అందాల యాంకర్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేయడంతో వైరల్ గా మరి చక్కర్లు కొడుతున్నాయి ఆయా ఫోటోలు. ఇంతకు ఈ ఫొటోలో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తుంది ఈ బ్యూటీ.

పాలుగారే బుగ్గలతో ముద్దొస్తున్న ఈ చిన్నది ఎవరో కాదు. బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి. అందంతో చలాకీతనంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. శ్రీముఖి బుల్లితెరపైనే కాదు వెండి తెరపైన కూడా మెసిరిసింది. పలు సినిమాల్లో ఈ అమ్మడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అంతే కాదు కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గాను నటించింది. ఇటీవలే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది శ్రీముఖి. ఇదిలా ఉంటే శ్రీముఖి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలతో.. వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ.

Shrimukhi

Shrimukhi

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..

Shamna Kasim: బ్లాక్ ఫార్మల్ డ్రెస్‏లో అదిరిపోయిన పూర్ణ.. ఇలా ఎప్పుడైనా ఊహించారా.. లెటేస్ట్ పిక్స్…

Shruti Haasan: రెడ్ డ్రెస్‏లో మెరిసిపోతున్న శ్రుతిహాసన్.. గులాబిని సైతం మైమరపించేలా ఉన్న ముద్దుగుమ్మ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu