AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కండోమ్‌ కొనండి.. కారు సొంతం చేసుకోండి.. విచిత్రమైన పబ్లిసిటీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..

Viral News: గతంలో కండోమ్‌పై పెద్దగా అవగాహన ఉండేది కాదు. వీటికి సంబంధించిన ప్రకటనలు కూడా పెద్దగా కనిపించేవి కావు. కానీ ప్రస్తుతం కాలం మారుతోంది. మీడియా విస్తృతి పెరుగుతోంది, సోషల్‌ మీడియా..

Viral News: కండోమ్‌ కొనండి.. కారు సొంతం చేసుకోండి.. విచిత్రమైన పబ్లిసిటీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు..
Viral News
Narender Vaitla
|

Updated on: Nov 16, 2021 | 7:27 AM

Share

Viral News: గతంలో కండోమ్‌పై పెద్దగా అవగాహన ఉండేది కాదు. వీటికి సంబంధించిన ప్రకటనలు కూడా పెద్దగా కనిపించేవి కావు. కానీ ప్రస్తుతం కాలం మారుతోంది. మీడియా విస్తృతి పెరుగుతోంది, సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎయిడ్స్‌, కండోమ్‌ వినియోగం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీంతో ప్రకటనదారులు కూడా కండోమ్‌లకు సంబంధించిన ప్రకటనలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే కొన్ని సంస్థలు ఈ ప్రకటనలోనూ తమ క్రియేటివిటీని చూపిస్తున్నాయి. తాజాగా ఓ కండోమ్‌ కంపెనీకి చెందిన యాడ్‌ ఇలానే వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. డ్యూరెక్స్‌ అనే కంపెనీ తాము తయారు చేసే కండోమ్‌ల ప్రచారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. కండోమ్‌ ప్యాక్‌తో పాటు ఒక బొమ్మ కారును ఉచితంగా ఇస్తోంది. కండోమ్‌ ప్యాక్‌తో పాటు ఈ కారును కూడా అందులోనే ప్యాక్‌ చేశారు. దీంతో కంపెనీ ఇస్తోన్న ఈ కారు గిఫ్ట్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఈ ప్యాక్‌ను ఫోటో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ‘ఒకవేళ కండోమ్‌ చిరిగిపోతే.. పుట్టబోయే పిల్లలు ఆడుకోవడానికి ఇది ఇచ్చి ఉంటారంటూ’ ఒకరు.. ‘ఇదేక్కడి పబ్లిసిటీరా బాబు’ అంటూ మరొకరు.. ఇలా రకరకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ యాడ్‌కు సంబంధించి పోస్టులు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Also Read: T20 World Cup 2021: పాకిస్తాన్‌ ఆటగాడి ఆస్పత్రి స్టోరీ.. 20 నిమిషాలు ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి..

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?

Aryan Khan Case Updates: ఎన్సీబీ సిట్‌ విచారణకు షారూఖ్ ఖాన్ మేనేజర్‌.. 25 కోట్ల ఒప్పందంపై కీలక వివరాలు వెల్లడి..