AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: పాకిస్తాన్‌ ఆటగాడి ఆస్పత్రి స్టోరీ.. 20 నిమిషాలు ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి..

T20 World Cup 2021: ICC T20 వరల్డ్ కప్-2021లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు అద్బుతమైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. భారత్‌ను ఓడించడం ద్వారా చారిత్రాత్మక విజయాన్ని

T20 World Cup 2021: పాకిస్తాన్‌ ఆటగాడి ఆస్పత్రి స్టోరీ.. 20 నిమిషాలు ఆలస్యమైతే ప్రాణాలు గాల్లో కలిసేవి..
Mohammed Rizwan
uppula Raju
|

Updated on: Nov 16, 2021 | 5:56 AM

Share

T20 World Cup 2021: ICC T20 వరల్డ్ కప్-2021లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు అద్బుతమైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. భారత్‌ను ఓడించడం ద్వారా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఏ ఫార్మాట్‌లోనైనా ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇదే తొలి విజయం. ఈ విజయంలో కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కూడా కీలక పాత్ర పోషించాడు. అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్న రిజ్వాన్ జట్టును సెమీఫైనల్‌కు చేర్చడంలో పెద్ద పాత్ర పోషించాడు. అయితే సెమీఫైనల్‌కు ముందే రిజ్వాన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాడు. నివేదికల ప్రకారం.. నవంబర్ 9 రాత్రి రిజ్వాన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరంతో బాధపడుతున్నాడు. అతని కోవిడ్ పరీక్ష కూడా జరిగింది కానీ నెగిటివ్‌ వచ్చింది. రిజ్వాన్‌ను ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచారు. అయితే మరునాడే తిరిగి వచ్చిన రిజ్వాన్ 52 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

వైద్యులు పూర్తి సమాచారం ఇవ్వలేదు ఆ రోజు గురించి రిజ్వాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఆరోగ్యం బాగోలేదు. నేను ఆసుపత్రికి వెళుతున్నాను మా కుటుంబం హోటల్‌లో ఉంది. నేను ECG కోసం హోటల్‌కి కిందికి వెళ్తున్నానని చెప్పాను. ఆస్పత్రికి వెళ్లే సరికి ఊపిరి ఆడలేదు. అప్పుడు నర్సును ఏమైందని అడిగాను 20 నిమిషాలు ఆలస్యం చేస్తే ప్రాణాలు పోయేవని చెప్పింది. నాకు డాక్టర్ మాటలు ఇంకా గుర్తున్నాయి. నేను సెమీ ఫైనల్స్‌లో ఆడాలని కోరుకుంటున్నానని చెప్పాను కానీ అతను నా పరిస్థితిని వివరించాడు. మ్యాచ్ తర్వాత ఏది జరిగినా నేను నిరాశ చెందనని చెప్పాను ఎందుకంటే నేను పాకిస్తాన్ కోసం ప్రతిదీ చేయగలనని చెప్పాను. ఈ విషయం అతనికి నచ్చింది. నేను కోలుకోవడానికి చేయగలిగినదంతా చేశాడు” అని రిజ్వాన్ వివరించాడు.

గొప్ప ప్రపంచ కప్ రిజ్వాన్ ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతను ఆరు మ్యాచ్‌ల్లో 70.25 సగటుతో 281 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు నమీబియాపై చేసిన 79 పరుగులు. అతను ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో కూడా 67 పరుగులు చేశాడు కానీ జట్టును గెలిపించలేకపోయాడు.

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?

Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..

Cryptocurrency: నిషేధం కాదు నియంత్రణ అవసరం.. క్రిప్టోకరెన్సీపై పార్లమెంట్ కమిటీ చర్చ..