- Telugu News Photo Gallery Cricket photos Only 3 T20s In 6 Years Turned As A Savior To Australia In T20 World Cup 2021 Name Is Josh Hazlewood
కేవలం 3 టీ20 మ్యాచ్‌లు.. ధోని వద్ద పాఠాలతో ఆస్ట్రేలియాను ‘ఛాంపియన్’గా నిలిపాడు.. ఎవరో తెలుసా.?
ఈ క్రికెటర్ గత ఆరేళ్ళలో కేవలం 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఆ అనుభవంతో తాజాగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడు తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అతడెవరో తెలుసా.?
Updated on: Nov 15, 2021 | 7:14 PM

టీ20 ప్రపంచకప్ 2021ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే.. టోర్నీకి ముందు ఈ రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయని చాలా తక్కువ మంది అంచనా వేశారు. ఆసీస్ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ప్రపంచకప్‌కు ముందు వరుసగా నాలుగు టీ20 సిరీస్‌లలో ఓటమి చవిచూసింది. అయితే సీన్ రివర్స్ చేసింది. ఏకంగా ఆసీస్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఈ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియా విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడెవరో కాదు జోష్ హెజిల్‌వుడ్. అయితే ఈ ప్లేయర్ ఏడాది క్రితం వరకు టీ20 క్రికెట్ ఆడలేదు.

2021 టీ20 ప్రపంచకప్‌లో జోష్ హెజిల్‌వుడ్ మొత్తంగా ఏడు మ్యాచ్‌ల్లో 13 స్ట్రైక్ రేట్‌తో 11 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌లో 16 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

2014 ఫిబ్రవరి నుంచి 2020 జనవరి మధ్య జోష్ హెజిల్‌వుడ్ కేవలం మూడు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వన్డేలు, టీ20ల్లో హెజిల్‌వుడ్ రాణిస్తాడన్న నమ్మకం ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్‌కు లేదు. అందుకే 2019 వన్డే ప్రపంచకప్ జాబితాలో అతడి పేరును ఎంపిక చేయలేదు.

వన్డేలు, టీ20ల్లో చోటు దక్కకపోయేసరికి జోష్ హెజిల్‌వుడ్ బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొన్నాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. టీ20 క్రికెట్‌లో విజయవంతం కావడానికి వివిధ రకాల బౌలింగ్ చిట్కాలను నేర్చుకున్నాడు. చెన్నై కెప్టెన్ ధోని దగ్గర నుంచి పలు కీలక సూచనలు అందుకున్నాడు. అలాగే గ్లెన్ మెక్‌గ్రాత్, ఆండ్రూ టై, జేమ్స్ ఫాల్క్‌నర్ దగ్గర నుంచి కూడా పలు బౌలింగ్ టెక్నిక్స్ తెలుసుకుని గంటల తరబడి ప్రాక్టిస్ చేశాడు.

ఫలితంగా టీ20 క్రికెట్‌లోకి పునరాగమనం.. ఒకే సంవత్సరంలో మూడు విజేత జట్లలో భాగం... 2019-20లో బిగ్ బాష్ లీగ్ ట్రోఫీ, IPL 2021 ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ 2021 ట్రోఫీని అందుకున్నాడు. IPL 2021లో CSK ఛాంపియన్‌గా నిలవడంలో హెజిల్‌వుడ్ ముఖ్యపాత్ర పోషించాడు. యూఏఈ పిచ్‌లకు అనుగుణంగా తనను తాను మార్చుకుని చక్కటి బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ సీఎస్‌కే అనుభవాన్ని టీ20 ప్రపంచకప్ 2021లో ఉపయోగించాడు.





























