- Telugu News Photo Gallery Cricket photos 2021 T20 World Cup Final New Zealand Skipper kane williamson smashed 39 runs in mitchell starc 12 balls New Zealand vs Australia
2021 T20 World Cup Final: ఫైనల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. రికార్డులు బ్రేక్ చేసిన కివీస్ కెప్టెన్
New Zealand Vs Australia, Final: న్యూజిలాండ్‌పై మిచెల్ స్టార్క్ 3 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. మలింగ తర్వాత టీ20 ఫైనల్‌లో 50 పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా మారాడు.
Updated on: Nov 14, 2021 | 9:55 PM

టీ20 ప్రపంచ కప్ 2021 ఫైనల్లో, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆస్ట్రేలియా బౌలర్లకు సిక్సర్లతో షాక్ ఇచ్చాడు. టోర్నీ అంతటా పేలవ ఫామ్‌లో ఉన్న కేన్ విలియమ్సన్ ఫైనల్లో 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. విలియమ్సన్ స్ట్రైక్ రేట్ 177.08 గా నిలిచింది.

కేన్ విలియమ్సన్ చాలా నెమ్మదిగా ఆరంభించినా చివరి క్షణాల్లో ఆస్ట్రేలియా బౌలర్లపై కివీస్ కెప్టెన్ విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌పై విలియమ్సన్ బౌండరీ వర్షం కురిపించి భయపెట్టాడు.

మిచెల్ స్టార్క్ వేసిన 12 బంతుల్లో కేన్ విలియమ్సన్ 39 పరుగులు చేశాడు. 11వ ఓవర్లో స్టార్క్ వేసిన 3 వరుస బంతుల్లో విలియమ్సన్ 3 ఫోర్లు బాదగా, ఆ తర్వాత కివీస్ కెప్టెన్ 16వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన మిచెల్ స్టార్క్ 6 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ చాలా నెమ్మదిగా ఆరంభించాడు. అతను మొదటి 16 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అనంతరం కేవలం 32 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించాడు. ఇది టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది.

కేన్ విలియమ్సన్ తన 2000 టీ20 పరుగులను టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఫైనల్‌లో పూర్తి చేశాడు. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన రెండవ కెప్టెన్‌గా కూడా నిలిచాడు. అతనికి ముందు, సంగక్కర 2009 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు.





























