- Telugu News Photo Gallery Cricket photos Indian Player Smriti Mandhana stars in Sydney Thunder win in WBBL and disappointing day for Shafali Verma
WBBLలో ఇండియన్ బ్యాటర్ తుఫాన్ ఇన్నింగ్స్.. 39 బంతుల్లోనే ప్రత్యర్థులకు చుక్కలు..!
Smriti Mandhana: బిగ్ బాష్ లీగ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతంగా ఆడుతోంది. సిడ్నీ థండర్ తరఫున ఆమె ఎన్నో సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడింది.
Updated on: Nov 14, 2021 | 4:27 PM

ఆదివారం జరిగిన మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యుబీబీఎల్)లో డిఫెండింగ్ ఛాంపియన్ సిడ్నీ థండర్ ఆరు వికెట్ల తేడాతో సిడ్నీ సిక్సర్‌పై టీ20 ఫార్మాట్‌లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 45 పరుగులతో మెరుపులు మెరిపించింది.

భారత ఓపెనర్ మంధాన తన అర్ధ సెంచరీని పూర్తి చేయడంలో మాత్రం విఫలమైంది. అయితే ఆమె 39 బంతుల్లో ఆరు ఫోర్లు బాదేసింది. కొరిన్ హాల్ (19)తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును లక్ష్యానికి చేరువ చేసింది. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (4 నాటౌట్) ఓ ఫోర్ సాధించి మరో 28 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించింది.

సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోయింది. అయితే దూకుడు ఓపెనర్ షెఫాలీ వర్మ 14 బంతుల్లో 8 పరుగులు చేసిన తర్వాత దీప్తి వేసిన అద్భుతమైన త్రోలో రనౌట్ అయింది. సిక్సర్ల కెప్టెన్ ఎల్లీస్ పెర్రీ 40 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేసి జట్టు స్కోరును ఆరు వికెట్ల నష్టానికి 94కు చేర్చింది.

మరో మ్యాచ్‌లో భారత వెటరన్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 3.2 ఓవర్లలో 19 పరుగులకే ఆలౌటైంది. బ్రిస్బేన్ హిట్స్ అడిలైడ్ స్ట్రైకర్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.





























