AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cryptocurrency: నిషేధం కాదు నియంత్రణ అవసరం.. క్రిప్టోకరెన్సీపై పార్లమెంట్ కమిటీ చర్చ..

భారత్‌లో క్రిప్టోకరెన్సీల భవిష్యత్తుపై ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సమావేశం అయ్యింది. ఎక్స్ఛేంజీలు..

Cryptocurrency: నిషేధం కాదు నియంత్రణ అవసరం.. క్రిప్టోకరెన్సీపై పార్లమెంట్ కమిటీ చర్చ..
Cryptocurrency
Sanjay Kasula
|

Updated on: Nov 16, 2021 | 12:20 AM

Share

భారత్‌లో క్రిప్టోకరెన్సీల భవిష్యత్తుపై ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సమావేశం అయ్యింది. ఎక్స్ఛేంజీలు, బ్లాక్ చైన్, క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (BACC), పరిశ్రమ సంస్థలు, ఇతర వాటాదారులతో సోమవారం ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించింది కమిటీ. ఈరోజు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందులో క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులను ఆపలేమని.. అయితే దానిని ఖచ్చితంగా నియంత్రించవచ్చని మాత్రం కమిటీ సభ్యులు అంగీకరించినినట్లుగా తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించడానికి చాలా మంది కమిటీ సభ్యులు అనుకూలంగా లేరని సమాచారం. వారు దాని మార్పిడి. నియంత్రణకు అనుకూలంగా ఉన్నారని.. తద్వారా క్రిప్టో దుర్వినియోగం చేయబడకుండా చూడాలని కోరినట్లుగా తెలుస్తోంది.

భద్రతపై కమిటీ సభ్యుల ఆందోళన..

సమావేశానికి హాజరైన ఎంపీలు (ఫైనాన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు) క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడిదారుల డబ్బు భద్రతపై నొక్కిచెప్పారు. జాతీయ వార్తాపత్రికలలో ఫుల్ పేజ్ క్రిప్టో ప్రకటనపై సమావేశానికి హాజరైన సభ్యుడు ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడం ప్రజల హక్కు అని నిపుణులు కొందరు వాధించినట్లుగా తెలుస్తోంది. దేశంలోని ఏ వ్యక్తి అయినా తన ఇష్టపూర్వకంగా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చని చెప్పడమే దీని అర్థం.

కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారుల నుంచి ఈ డిమాండ్

క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇప్పుడు ఈ మొత్తం విషయంలో ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి తమ ఆందోళనలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నారు. క్రిప్టో ఫైనాన్స్ యొక్క పెట్టుబడి నష్టాలకు సంబంధించి వివిధ పార్టీల ఆసక్తి, ఆందోళనలు ఇటీవలి కాలంలో వేగంగా పెరిగాయని మీకు తెలియజేద్దాం. ఈ పార్లమెంటరీ కమిటీ ఐఐఎం అహ్మదాబాద్‌లోని విద్యావేత్తల సూచనలను కూడా తీసుకుంటుంది.

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ కుంభకోణం

ఇటీవల కర్ణాటక నుంచి వెలుగులోకి వచ్చిన ఆరోపించిన బిట్‌కాయిన్ (క్రిప్టోకరెన్సీ) కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందనే సంగతి తెలిసిందే.గ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వివరణ ఇవ్వాల్సి ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారంటే విషయం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: CM Jagan: రహదారులపై సీఎం జగన్ ఫోకస్‌.. రోడ్ల మరమ్మతులపై అధికారులకు డెడ్‌లైన్‌..