Gold Price Today: మహిళలకు గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేట్‌ ఎంతంటే..?

Gold Price Today: పసిడి ప్రియులకు కొంచెం ఉపశమనం లభించింది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ రోజు విక్రయాలు చేయవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం

Gold Price Today: మహిళలకు గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేట్‌ ఎంతంటే..?
Follow us
uppula Raju

|

Updated on: Nov 16, 2021 | 5:52 AM

Gold Price Today: పసిడి ప్రియులకు కొంచెం ఉపశమనం లభించింది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ రోజు విక్రయాలు చేయవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీపావళీ.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పైపైకి వెళ్లాయి. కానీ తాజాగా మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దాదాపుగా రూ.250 వరకు తగ్గింది. దీంతో మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900కు చేరింది. అలాగే 10 గ్రాముుల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 50,070కు చేరింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,070కు చేరింది. అలాగే దేశీయ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,250కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,620కు చేరింది. అలాగే చెన్నై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర గోల్డ్ రేట్ రూ. 46,310కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,520కు చేరింది. అలాగే ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,930కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 48,930కు చేరింది. ఇక విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,900ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,070కు చేరింది.

అయితే అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలలో మార్పులు.. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటీ వడ్డీ రేట్లు.. వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపే అంశాలు. ఇక గత కొద్ది రోజులుగా బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజూకీ స్వల్పంగా పసిడి ధరలు పెరుగుతూ బంగారం కొనాలనుకునేవారికి షాకిస్తున్నాయి.

weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్‌ ట్రెండ్స్‌ ఇవే..!

Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?