weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్ ట్రెండ్స్ ఇవే..!
weight loss diets 2021: కాలానుగుణంగా బరువు తగ్గించే పద్దుతులు నిత్యం మారుతూనే ఉంటాయి. మెరుగైన ఆరోగ్యం కోసం ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అయితే ఇందులో కొందరు
weight loss diets 2021: కాలానుగుణంగా బరువు తగ్గించే పద్దుతులు నిత్యం మారుతూనే ఉంటాయి. మెరుగైన ఆరోగ్యం కోసం ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అయితే ఇందులో కొందరు మాత్రమే తమ మాటకు కట్టుబడి ఉంటారు మరికొందరు ఘోరంగా విఫలమవుతారు. అయితే 2021లో ఎక్కువ మంది ఫాలోయిన వెయిట్ లాస్, డైట్ ట్రెండ్‌ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. ఫ్లెక్సిటేరియన్ డైట్ ఈ డైట్‌లో బరువు తగ్గడానికి ప్రజలను మొక్కల ఆధారిత , జంతువుల ఆధారిత ఆహారాన్ని మితంగా తినమని ప్రోత్సహిస్తుంది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, తక్కువ జంతు ఆధారిత, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినమని సూచిస్తుంది. పూర్తిగా శాకాహారం లేదా కొంచెం ఫ్లెక్సిటేరియన్‌గా ఉండాలని చెబుతోంది.
2. WW (వెయిట్ వాచర్స్) ఈ డైట్‌ని వెయిట్ వాచర్స్ డైట్ అని పిలుస్తారు. ఇది బరువు తగ్గించే డైట్‌లలో ఒకటి. నిదానంగా, స్థిరంగా బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఇది ఒక గొప్ప ఆహార ఎంపిక. సమర్థవంతమైన, దీర్ఘకాలిక బరువు తగ్గడానికి ప్రజలు వాస్తవిక లక్ష్యాలను కలిగి ఉండాలని WW సిఫార్సు చేస్తుంది.
3. శాఖాహారం చాలా మంది ప్రజలు ఇటీవల శాఖాహారం తినాలని కోరుకుంటున్నారు. కానీ సరైన పద్ధతిలో ఈ డైట్‌పాటిస్తే బరువు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ డైట్‌లో పాల ఉత్పత్తులతో సహా అమైనో ఆధారిత ఆహార ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువ కాలం ఈ డైట్‌ని అనుసరించడం వల్ల పోషకాహార లోపం కూడా ఏర్పడుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినే వ్యక్తుల కంటే శాఖాహారం తీసుకునే వ్యక్తులు ఎక్కువ బరువు కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
4. వాల్యూమెట్రిక్ డైట్ వాల్యూమెట్రిక్ డైట్ కేలరీలు తక్కువగా ఉండాలని సిఫార్సు చేస్తుంది. అలాగే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినమని సూచిస్తుంది. ఈ డైట్‌లో నీరు ఎక్కువగా తాగాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ డైట్ ప్రధాన లక్ష్యం ప్రజలలో మంచి అలవాట్లను పెంపొందించడం, జీవనశైలి మార్పులను తీసుకురావడం.
5. మాయో క్లినిక్ డైట్ మాయో క్లినిక్ డైట్ అనేది జీవితాంతం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ డైట్ కొత్త అలవాట్లను అలవర్చుకోవడానికి పాత అలవాట్లను వదిలిపెట్టడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ వ్యూహం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఎక్కువ పండ్లు, కూరగాయలు తినమని చెబుతుంది. అలాగే కొవ్వులు, స్వీట్లను పరిమితం చేయాలని సూచిస్తుంది.