NZ vs AUS, T20 World Cup 2021 Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం..
AUS Vs NZ: టీ 20 వరల్డ్ కప్ 2021లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ విధించిన
AUS Vs NZ: టీ 20 వరల్డ్ కప్ 2021లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిసారి టీ 20 వరల్డ్ కప్ సాధించింది. కివీస్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీసీ బ్యాటర్లు మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేధించారు. ముఖ్యంగా మిచెల్ మార్షల్ 77 పరుగులతో జట్టును విజయ తీరాలకుచేర్చాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ అర్ద సెంచరీతో అదరగొట్టాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బోల్ట్ రెండు వికెట్లు తీయగా మిగతా వారు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ప్లేయర్ ఆప్ ద మ్యాచ్‌గా మిషెల్ మార్ష్ నిలిచాడు. ప్లేయర్ ఆప్ టోర్నమెంట్ అవార్డ్ వార్నర్‌కి దక్కింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మార్టిన్ గప్టిల్ (28), డారిల్ మిచెల్ (11) తొలి వికెట్‌గా 28 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కీలక మ్యాచులో భారీ భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే 85 పరుగులు సాధించి, ఫైనల్లో మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. గ్లెన్ ఫిలిప్స్(18) కూడా ఫైనల్ మ్యాచులో ఆకట్టుకోలేక పోయాడు. చివరలో జేమ్స్ నీషమ్ 13, టిమ్ సీఫెర్ట్ 8 పరుగులతో చివరిదాక క్రీజులో ఉండి మరో వికెట్ పడకుండా టీం స్కోర్‌ను 172 పరుగులకు చేర్చారు.ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు, ఆడం జంపా 1 వికెట్ పడగొట్టారు.