T20 World Cup 2021: 6 మ్యాచుల్లో అంతగా ఆడలే.. ఫైనల్లో మాత్రం భీభత్సం.. 177 స్ట్రైక్ రేట్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆడిన విలియమ్సన్

New Zealand Vs Australia: ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 ఫైనల్‌లో కేన్ విలియమ్సన్ అద్భుతమైన అర్ధ సెంచరీని సాధించి తన జట్టును మంచి స్థితిలో ఉంచాడు.

T20 World Cup 2021: 6 మ్యాచుల్లో అంతగా ఆడలే.. ఫైనల్లో మాత్రం భీభత్సం.. 177 స్ట్రైక్ రేట్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆడిన విలియమ్సన్
Nz Vs Aus, T20 World Cup 2021 Final Kane Williamson
Follow us

|

Updated on: Nov 14, 2021 | 9:49 PM

New Zealand Vs Australia: ‘ప్లేయర్ ఆఫ్ ది బిగ్ మ్యాచ్’ అనేది ఏలాంటి మ్యాచులోనైనా సత్తా చూపించి ఫలితాన్నే మార్చేస్తుంటారు. టోర్నమెంట్ ఫైనల్ అయినా, వరల్డ్ కప్ సెమీ ఫైనల్ అయినా, ఫైనల్ అయినా సరే సూపర్బ్ ఇన్నింగ్ ఆడుతూ ఆకట్టుకుంటారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి నిరూపించాడు. అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని సత్తా చాటాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 ఫైనల్లో, విలియమ్సన్ తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ కెప్టెన్‌ అద్భుత అర్ధసెంచరీతో ఆడి జట్టును బలోపేతం చేశాడు. విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌కు ముందు విలియమ్సన్ అంతగా ఫామ్‌లో లేకపోయినా ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా అతని బ్యాట్‌ నుంచి రాలేదు. ఫైనల్‌కు వచ్చిన వెంటనే విలియమ్సన్ సరికొత్త ఫామ్‌తో ఆస్ట్రేలియన్‌ను చిత్తు చేశాడు.

ఫైనల్‌కు వచ్చిన విలియమ్సన్ గతాన్ని వదిలిపెట్టి బాధ్యతలు స్వీకరించి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు విలియమ్సన్ ఇంగ్లండ్‌పై 5, ఆఫ్ఘనిస్తాన్‌పై 40, నమీబియాపై 28, స్కాట్‌లాండ్‌పై 0, భారత్‌పై 33 నాటౌట్, పాకిస్థాన్‌పై 25 పరుగులు సాధించాడు. ఫైనల్‌లో తన జట్టుకు భారీ స్కోరు అందించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. జట్టు నెమ్మదిగా ప్రారంభమైనప్పుడు ఈ బాధ్యత మరింతగా పెరిగింది. అయితే విలియమ్సన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించి తర్వాత తనదైన శైలిని ప్రదర్శించాడు.

నెమ్మదిగా ప్రారంభించి.. బౌలర్లపై భీకర ప్రదర్శన.. విలియమ్సన్ క్రీజులోకి వచ్చేసరికి జట్టు స్కోరు 3.5 ఓవర్లలో 28 పరుగులకు ఒక వికెట్ గా ఉంది. విలియమ్సన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. అతను తన మొదటి ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఆ తర్వాత 13 బంతుల్లో అతని ఖాతాలో ఏడు పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఇక్కడి నుంచి మళ్లీ విలియమ్సన్ యాక్సిలరేటర్‌పై కాలు మోపి ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకపడ్డాడు. వేగంగా పరుగులు చేయడం ప్రారంభించాడు. ఫలితంగా కేవలం 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంటే తర్వాతి 19 బంతుల్లో విలియమ్సన్ 43 పరుగులు చేశాడు.

ఫైనల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. దీంతో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. ఈ విషయంలో అతను శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్‌ల రికర్డును బ్రేక్ చేశాడు. 2014లో భారత్‌తో జరిగిన ఫైనల్‌లో సంగక్కర 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో, 2016లో వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌లో రూట్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అర్ధ సెంచరీ సాధించిన తర్వాత కూడా విలియమ్సన్ భారీ షాట్లు ఆడాడు.

హాజిల్‌వుడ్ బ్రేక్‌లు.. జోష్ హేజిల్‌వుడ్ కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అనే తుఫానును నిలవరించాడు. 18వ ఓవర్ ఐదో బంతికి స్టీవ్ స్మిత్ చేతికి చిక్కిన విలియమ్సన్ క్యాచ్ అందుకున్నాడు. సెంచరీ దిశగా సాగుతున్న విలియమ్సన్, హేజిల్‌వుడ్ వేసిన బంతిని లాంగ్ ఆఫ్‌లో కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే నేరుగా స్మిత్ చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 48 బంతులు ఎదుర్కొన్నాడు, 10 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. 177.08 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేశాడు.

Also Read: NZ vs AUS, T20 World Cup 2021 Final: ఆస్ట్రేలియా టార్గెట్ 173.. అర్థ సెంచరీతో ఆకట్టుకున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌

T20 World Cup 2021: బంతిని ముందుగానే వదులుతున్నాడు.. ఆడమ్ జంపా బౌలింగ్‎లో అది గమనించాను..