NZ vs AUS, T20 World Cup 2021 Final: ఆస్ట్రేలియా టార్గెట్ 173.. అర్థ సెంచరీతో ఆకట్టుకున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌

NZ vs AUS: కీలకమైన ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. దీంతో ఆస్ట్రేలియా టీం ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

NZ vs AUS, T20 World Cup 2021 Final: ఆస్ట్రేలియా టార్గెట్ 173.. అర్థ సెంచరీతో ఆకట్టుకున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌
Nz Vs Aus, T20 World Cup 2021 Final
Follow us
Venkata Chari

|

Updated on: Nov 14, 2021 | 9:15 PM

NZ vs AUS: కీలకమైన ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. దీంతో ఆస్ట్రేలియా టీం ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మార్టిన్ గప్టిల్ (28), డారిల్ మిచెల్ (11) తొలి వికెట్‌గా 28 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కీలక మ్యాచులో భారీ భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్(18) కూడా ఫైనల్ మ్యాచులో ఆకట్టుకోలేక పోయాడు.

కేన్ విలియమ్సన్ కేవలం 48 బంతుల్లోనే 85 పరుగులు సాధించి, ఫైనల్లో మరోసారి తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 177 సగటుతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ టీం స్కోర్ 148 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేన్ విలియమ్సన్‌ తరువాత క్రీజులోకి వచ్చిన జేమ్స్ నీషమ్ 13, టిమ్ సీఫెర్ట్ 8 పరుగులతో చివరిదాక క్రీజులో ఉండి మరో వికెట్ పడకుండా టీం స్కోర్‌ను 172 పరుగులకు చేర్చారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు, ఆడం జంపా 1 వికెట్ పడగొట్టారు.

Also Read: 21 సిక్సర్లు, 16 ఫోర్లు.. సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఆ ఆటగాడు ఎవరంటే.!

Bio Bubble: క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. బయో-బబుల్ నుంచి త్వరలో విముక్తి.. కొత్త మోడల్‌‌పై ఐసీసీ కసరత్తు..!