21 సిక్సర్లు, 16 ఫోర్లు.. సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఆ ఆటగాడు ఎవరంటే.!
క్రికెట్‌లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లను మనం చూసే ఉంటాం. రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ లాంటి...

క్రికెట్‌లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లను మనం చూసే ఉంటాం. రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ లాంటి బ్యాటర్లు చాలామంది ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. మీకు రోహిత్ శర్మ చేసిన 264 పరుగులు గుర్తిండొచ్చు. ఆ ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ.. తాజాగా ఓ బ్యాటర్ సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. అయితే ఇక్కడ ఈ ఆటగాడు రోహిత్ శర్మ కంటే అత్యధిక సిక్సర్లు బాదాడు. లిస్టు ఏ క్రికెట్‌లో జరిగిన ఈ అరుదైన రికార్డును 34 ఏళ్ల బ్యాట్స్‌మెన్ బ్రవీష్ శెట్టి సృష్టించాడు.
43 ఓవర్ల మ్యాచ్‌లో డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బ్రవీష్ శెట్టి.. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో నిలిచాడు. మొత్తంగా 134 బంతులు ఎదుర్కుని 21 సిక్సర్లు, 16 ఫోర్ల సాయంతో అజేయంగా 252 పరుగులు చేశాడు. బ్రవీష్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ నిర్ణీత 43 ఓవర్లలో 3 వికెట్లకు 569 పరుగులు చేసింది.
ఇక 570 పరుగుల భారీ టార్గెట్ చేధించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యంగ్ కామ్రేడ్ క్రికెట్ క్లబ్ 43 ఓవర్లలో 6 వికెట్లకు 364 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో 105 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, ఈ ప్రత్యేక ఇన్నింగ్స్‌తోనైనా తాను ముంబై జట్టులోకి తిరిగి చోటు దక్కించుకుంటానని బ్రవీష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబై, త్రిపుర జట్ల తరపున బ్రవీష్.. 9 ఫస్ట్ క్లాస్, 14 లిస్ట్ A, 6 T20 మ్యాచ్‌లు ఆడాడు.