CM Jagan: రహదారులపై సీఎం జగన్ ఫోకస్‌.. రోడ్ల మరమ్మతులపై అధికారులకు డెడ్‌లైన్‌..

ఏపీలో రహదారులకు మహర్దశ పట్టనుందా? ఇక రోడ్లపై వాహనాలు నిరాటంకంగా దూసుకుపోనున్నాయా ? తాజాగా రహదారులపై ఫోకస్‌ పెట్టారు సీఎం జగన్‌. రోడ్ల మరమ్మతుల కోసం అధికారులకు..

CM Jagan: రహదారులపై సీఎం జగన్ ఫోకస్‌.. రోడ్ల మరమ్మతులపై అధికారులకు డెడ్‌లైన్‌..
Cm Jagan
Follow us

|

Updated on: Nov 15, 2021 | 6:15 PM

ఏపీలో రహదారులకు మహర్దశ పట్టనుందా? ఇక రోడ్లపై వాహనాలు నిరాటంకంగా దూసుకుపోనున్నాయా ? తాజాగా రహదారులపై ఫోకస్‌ పెట్టారు సీఎం జగన్‌. రోడ్ల మరమ్మతుల కోసం అధికారులకు డెడ్‌లైన్‌ విధించారు. ఏపీలో రహదారుల దుస్ఠితిపై గత కొంతకాలంగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు అనేకసార్లు ఆందోళన నిర్వహించారు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆందోళనకు దిగారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దీనిపై స్పందించింది. రహదారుల రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్‌. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఏపీలో రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించాలని ఆదేశించారు. విమర్శలకు తావివ్వకుండా రోడ్ల మరమ్మతులు జరగాలన్నారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. 2022 జూన్‌ నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని డెడ్‌లైన్‌ విధించారు. వచ్చే నెలలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారని, ఈలోగా పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలు సేకరించాలని సీఎం సూచించారు. కేంద్రమంత్రికి పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌.
రహదారుల మరమ్మతులు, పునరుద్దరణపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సీఎస్‌ సమీర్‌శర్మ, ఇతర అధికారులు హాజరయ్యారు.