AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Municipal Elections 2021: ఏపీలో ముగిసిన మున్సిపల్‌ పోలింగ్‌.. కుప్పంలో టీడీపీ-వైసీపీ మధ్య హోరా హోరీ..

ఏపీలో ముగిసిన మున్సిపల్‌ పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్‌, 12 నగర పంచాయతీల్లో ఓటింగ్‌ పూర్తయింది. 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు.

AP Municipal Elections 2021: ఏపీలో ముగిసిన మున్సిపల్‌ పోలింగ్‌.. కుప్పంలో టీడీపీ-వైసీపీ మధ్య హోరా హోరీ..
Tdp Vs Ysrcp
Sanjay Kasula
|

Updated on: Nov 15, 2021 | 5:51 PM

Share

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.. ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది అధికార వైసీపీ. మెయిన్‌గా కుప్పం మున్సిపాల్టీపై ఫోకస్‌ పెట్టింది ఫ్యాన్‌ పార్టీ. చంద్రబాబుకు దిమ్మదిరిగిపోయేలా రిజల్ట్‌ రావాలని భారీగా ప్లాన్‌ చేసింది. అటు టీడీపీ కూడా ఇజ్జత్‌కా సవాల్‌గా తీసుకుంది. దాంతో కుప్పంలో టీడీపీ-వైసీపీ మధ్య హోరా హోరీ పోరు నడిచింది. ఉదయం నుంచి పెద్దసంఖ్యలో పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఏపీలో మున్సిపల్‌ పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్‌, 12 నగర పంచాయతీల్లో ఓటింగ్‌ పూర్తయింది. 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటేసేందుకు అనుమతి ఇచ్చారు. ఎల్లుండి ఉదయం కౌంటింగ్‌ జరుగుతుంది. కీలకమైన కుప్పంలో ఉదయం నుంచి టెన్షన్‌ కొనసాగింది. దొంగ ఓట్లు వేయించారని వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కొన్ని చోట్ల ఘర్షణ కూడా జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేశారు.

కుప్పంలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. కుప్పం మున్సిపాల్టీలోని 16 వార్డులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైసిపి చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌ పోటీలో ఉన్న 16 వార్డు పోలింగ్‌ బూత్‌లో వైసిపి దొంగ ఓటర్లను దింపిందని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఐతే కావాలనే రాద్ధాంతం చేస్తున్నారంటూ వైసిపి కార్యకర్తలు ఆరోపించారు.

దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ ఫిర్యాదుతో పోలీసులు పలు పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్ల ఐడీ కార్దులను పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల దగ్గర పలువురు అనుమానితులను గుర్తించారు. వారిని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. చిత్తూరుజిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు తమిళనాడు, కర్నాటక నుంచి స్థానికేతరులు కుప్పం వచ్చినట్లు విచారణలో తేలింది.

కుప్పం మున్సిపాల్టీ ఎన్నికలపై టిడిపి-వైసిపి నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వైసిపి నేతలే దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని చంద్రబాబు ఆరోపించారు. ఐతే బాబు ఆరోపణలు అర్థరహితమ ని కౌంటరిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఇవి కూడా చదవండి: AP Municipal Elections: కుప్పంలో ఏం జరిగిందంటే.. వీడియోలను విడుదల చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి

Malaika Arora: హీరోయిన్ చెంపలు పట్టుకుని లాగిన బాలుడు.. షాక్‏లో మలైకా.. చివరకు ఏం చేసిందంటే..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ