AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల వనభోజనాలలో అశ్లీల నృత్యాలు

కార్తీక మాసంలో చాలా మంది వనభోజనాలకు వెళ్తుంటారు. కొందరు ఈ భోజనాలకు వెళ్లి సరదాగా ఆటలాడుతూ.. రోజంతా ఉత్సాహంగా గడుపుతుంటారు. కొందరు అటవీ ప్రాంతాల్లోకి, ఫామ్..

నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల వనభోజనాలలో అశ్లీల నృత్యాలు
Subhash Goud
|

Updated on: Nov 15, 2021 | 4:36 PM

Share

కార్తీక మాసంలో చాలా మంది వనభోజనాలకు వెళ్తుంటారు. కొందరు ఈ భోజనాలకు వెళ్లి సరదాగా ఆటలాడుతూ.. రోజంతా ఉత్సాహంగా గడుపుతుంటారు. కొందరు అటవీ ప్రాంతాల్లోకి, ఫామ్ హౌస్ లోకి, అలాగే ఆలయాల వద్దకు  వనభోజనాలకు వెళ్లి రోజంతా ఎంజాయ్‌ చేస్తుంటారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఇలా వనభోజనాలకు వెళ్లి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతుంటారు. ఏపీలో ఓ హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు వనభోజనాలకు వెళ్లి అక్కడ అశ్లీలతగా నృత్యాలు చేయడంపై విమర్శలకు తావిస్తోంది. కార్తీక వనభోజనాలు.. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు. జాతర్లు పేరు ఏదైనా రాజకీయ అండ .. పోలీసులు దన్ను ఉండడంతో అశ్లీల ప్రదర్శనలు సాగుతుండడం సభ్య సమాజంలో సిగ్గుపడేలా చేస్తుంది.

ఏపీలోని అనపర్తిలో నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన 1996- 97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం నల్లమిల్లి రామారెడ్డి( నేషనల్ ) తోటలో అశ్లీల ప్రదర్శనలు బహిరంగంగా నిర్వహించడం. వనభోజనాలకు వచ్చిన పెద్దలను, సిగ్గుపడేలా చేయడాన్ని నిర్వాహకుల తీరును ఖండించారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు లేకుండా ఉదాసీనంగా ఉండి పోయినట్లు పలువురు పోలీసులు తీరును ఎండగట్టారు. ఇదే ప్రదర్శనలు ఎవరైనా సామాన్యులు చేస్తే వారిపై విరుచుకు పడే పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. సరదాగా ఉత్సాహంగా గడిపే వన భోజన కార్యక్రమంలో ఇలాంటి దృశ్యాలను చూసిన పలువురు నోరెళ్లబెట్టారు. పూర్వ విద్యార్థులు ఇలాంటి నృత్యాలు చేస్తుండటంపై విమర్శలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

PF UAN Number: మీరు ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ నంబర్‌ మర్చిపోయారా..? ఇలా చేయండి..!

Siddipet Collector: సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా..!