Home Loan: అతి తక్కువ వడ్డీకి హోం లోన్ కావాలా.. ఆ బ్యాంక్‌లో అదిరిపోయే బంపర్ ఆఫర్..
కాలం మారింది.. లోన్ కావాలంటూ బ్యాంకుల ముందు క్యూలు కట్టాల్సిన పరిస్థితి పోయింది. ఇప్పుడు రివర్స్‌లో నడుస్తోంది. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు క్యూలో పోటీ పడుతున్నాయి.
కాలం మారింది.. లోన్ కావాలంటూ బ్యాంకుల ముందు క్యూలు కట్టాల్సిన పరిస్థితి పోయింది. ఇప్పుడు రివర్స్‌లో నడుస్తోంది. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు క్యూలో పోటీ పడుతున్నాయి. ఒకరికంటే.. మరొకరు త్వరగా.. తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో గృహ రుణాలకు సంబంధించి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వినియోగదారులకు తక్కువ ధరలకు గృహ రుణాలు అందించేందుకు పోటీ పడుతున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) గృహ రుణాలపై వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు కనీస వడ్డీ రేటు 6.8 శాతానికి బదులుగా 6.40 శాతం నుండి ప్రారంభమవుతుంది.
తగ్గిన రేటు అక్టోబర్ 27 నుంచి అమల్లోకి వస్తుంది. బ్యాంకుల చరిత్రలో అతి తక్కువ గృహ రుణ రేటు ఇది అని యూనియన్ బ్యాంక్ వెల్లడించింది. కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకునే లేదా ఇప్పటికే ఉన్న రుణాన్ని బదిలీ చేసే కస్టమర్‌లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇందులో బ్యాలెన్స్ బదిలీ కూడా ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ ఫెస్టివల్ సమయంలో మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. రేటు తగ్గింపు వల్ల మార్జిన్‌లు కొంతమేర తగ్గినప్పటికీ.. తమ బిజినెస్ పెరిగేందుకు ఊతమిస్తుందని భావిస్తోంది. యూనియన్ బ్యాంక్ ప్రస్తుతం 6.4 నుంచి 7.25 శాతం చొప్పున రుణాలు ఇస్తోంది. స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు వడ్డీ రేటు 6.5 నుండి 7.35 శాతం వరకు ఉంటుంది. దీని ప్రాసెసింగ్ రుసుము లోన్ మొత్తంలో 0.50 శాతం నుండి గరిష్టంగా రూ. 15000 వరకు GST ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్
బ్యాంక్ ఆఫ్ బరోడా రెండవ స్థానంలో ఉంది. దీని వడ్డీ రేటు 6.50 శాతం నుండి 7.85 శాతం వరకు ఉంటుంది. స్వయం ఉపాధి రుణదాతలకు వడ్డీ రేటు కూడా 6.50-7.85 శాతంగా నిర్ణయించబడింది. అంటే జీతం పొందే వ్యక్తులకు ఈ రుణ రేటు అక్టోబర్ 7 నుండి అమలులోకి వస్తుంది. రుణం మొత్తంలో 0.25 శాతం నుంచి 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.8,500 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది. ఒక లక్ష రుణానికి రూ. 746-827 వరకు EMI ఉంటుంది.
కోటక్ మహీంద్రా లోన్
కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేటు 6.55 శాతం నుండి 7.25 శాతం వరకు ఉంటుంది. దీని ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.25 శాతం నుండి 1 శాతం వరకు ఉంటుంది, GSTతో పాటు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కోటక్ మహీంద్రా రూ. 1 లక్ష రుణంపై రూ. 787 EMIని వసూలు చేస్తుంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వడ్డీ రేటు 6.60 శాతం నుండి 7.60 శాతం వరకు ఉంటుంది. ICICI బ్యాంక్ వడ్డీ రేటు 6.70 నుండి 7.55 శాతం వరకు ఉంటుంది. దీని ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం లోన్ మొత్తంలో GST+ EMIగా, రుణదాత ఒక లక్ష రూపాయలకు రూ. 757-809 వరకు చెల్లించాలి.
యాక్సిస్ బ్యాంక్ ఎంత వడ్డీ వసూలు
యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేటు 6.75 నుండి 7.2 శాతం వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కోసం లోన్ మొత్తంలో 1% వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కనీసం రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒక లక్ష రుణానికి రూ. 760-787 వరకు EMI ఉంటుంది. IDBI బ్యాంక్ వడ్డీ రేటు 6.75-9.90 శాతం వరకు ఉంటుంది. ఈ వడ్డీ రేటు 24 సెప్టెంబర్ 2021 నుండి అమలులోకి వస్తుంది. SBI టర్మ్ లోన్ వడ్డీ రేటు 6.75 నుండి 7.30 శాతం వరకు నిర్ణయించబడింది.
HDFC లిమిటెడ్ వడ్డీ రేటు 6.70-8.0%. జీతం పొందే వ్యక్తులు, స్వయం ఉపాధి పొందిన నిపుణుల కోసం, ప్రాసెసింగ్ రుసుము రుణ మొత్తంలో 0.50% లేదా రూ. 3,000, ఏది ఎక్కువ అయితే అది. స్వయం ఉపాధి పొందే వ్యక్తి నాన్-ప్రొఫెషనల్ కేటగిరీ కిందకు వస్తే, రుణ మొత్తంలో 1.50% లేదా రూ. 4,500, ఏది ఎక్కువైతే అది ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేయబడుతుంది. ఇందులో పన్ను అదనం. HDFC EMI ఒక లక్షపై రూ. 757 నుండి 836 వరకు చేయబడుతుంది.
ఇవి కూడా చదవండి: ISRO Spy case: నంబి నారాయణన్‌కు బిగ్ రిలీఫ్.. కేసు కొట్టేసిన కేరళ హైకోర్టు..
AP Municipal Elections: కుప్పంలో ఏం జరిగిందంటే.. వీడియోలను విడుదల చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి