Know This : భారత్‌లో తొలిసారి కనిపించిన అరుదైన పక్షి.. ప్రపంచవ్యాప్తంగా 3 సార్లు కనిపించిన..(వీడియో)
అత్యంత అరుదైన పక్షి భారత్‌లో తొలిసారి దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పక్షి 3 సార్లు మాత్రమే కనిపించిందట. ఈ పక్షి మొదట యునైటెడ్ కింగ్‌డమ్‌లో, రెండవసారి బ్రెజిల్‌లో కనిపించిందట. మూడోసారి భారత దేశంలో దర్శనమిచ్చిన ఈ పక్షి రాజస్థాన్‌లో కనిపించిందట.
అత్యంత అరుదైన పక్షి భారత్‌లో తొలిసారి దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పక్షి 3 సార్లు మాత్రమే కనిపించిందట. ఈ పక్షి మొదట యునైటెడ్ కింగ్‌డమ్‌లో, రెండవసారి బ్రెజిల్‌లో కనిపించిందట. మూడోసారి భారత దేశంలో దర్శనమిచ్చిన ఈ పక్షి రాజస్థాన్‌లో కనిపించిందట. ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు పక్షి వీక్షకులు భాను ప్రతాప్ సింగ్, విధాన్ ద్వివేది దీనిని చూశారట. అంత అరుదుగా కనిపించే ఆ పక్షి ఏంటో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా కనిపించే ఈ పక్షి పేరు లూసిస్టిక్ కామన్ కింగ్ ఫిషర్. ఈ పక్షి భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఆగస్టు 3న ఉదయం 6 గంటల 19 నిమిషాలకు దంగి గ్రామంలోని రెడ్ సెల్యూట్ ఫామ్‌లో కనిపించిందట. అయితే దాని గూడు గ్రామంలోని చెరువులో ఉన్నట్లు తెలిసిందట. అప్పటినుంచి భాను ప్రతాప్ సింగ్, విధాన ద్వివేది ఈ పక్షి గురించి సమాచారం రాబట్టడం మొదలుపెట్టారు. అలా దాని గూడును కనిపెట్టిన వీరు పక్షి నిపుణులను సంప్రదించి, సమాచారం అందించారు. వారు నిపుణుల సహాయంతో ఒక పరిశోధనా పత్రాన్ని సిద్ధం చేసి ఇండియన్ బర్డ్ వెబ్‌సైట్‌కు పంపారు. భారతదేశంలో తొలిసారి లూసిస్టిక్ కామన్ కింగ్ ఫిషర్ పక్షిని చూడటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పక్షి ప్రేమికులు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

