No Extra Work: ఎక్స్ ట్రా వర్క్‌కి చెక్ పెట్టే కొత్త చట్టం.. ఎక్స్‌ట్రా వర్క్ చేయమని బలవంత పెట్టకూడదు.. (వీడియో)
కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. వర్క్ ఫ్రం హోమ్‌లో వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్‌లు పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యేవారు.
కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. వర్క్ ఫ్రం హోమ్‌లో వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత కాన్ఫరెన్స్‌లు పెట్టేవారు. అందువల్ల చాలామంది ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యేవారు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్‌కి దూరంగా పనిచేయడంతో వేరే గత్యంతరం లేక పనిచేశారు. కానీ ఇప్పుడూ అలాంటి పనులు చేస్తే జరిమానా కట్టాలని బెదిరిస్తోంది పోర్చుగల్ ప్రభుత్వం.
కోవిడ్ -19 దృష్ట్యా 18 నెలలుగా ప్రజలు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు. దీంతో ఆఫీస్ కాల్స్, గ్రూప్ కాల్స్, జూమ్ మీటింగ్‌లు, కాన్ఫరెన్స్ కాల్స్ వంటివి ఎక్కువయ్యాయి. సహోద్యోగులతో మాట్లాడాలంటే ఆఫీస్‌కి రాలేరు కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ ఒక్కటే పరిష్కారం. దీంతో తాము మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ పోర్చుగల్ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది.దీంతో బాస్‌లు, టీమ్ లీడర్‌లు పని గంటలు అయిపోయిన తర్వాత సిబ్బందికి కాల్ చేసి ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఒకరకరంగా చెప్పాలంటే పనిగంటలు అయిపోయిన తర్వాత బాస్‌లు ఎటువంటి సందేశాలు గానీ, పోన్‌లుగానీ చేయకూడదు, అలాగే ఎక్స్‌ట్రా వర్క్ చేయమని బలవంతం చేయకూడదు అంటూ పోర్చుగల్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టం తీసుకువచ్చింది. ఒక వేళ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

