Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం...

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా  అభ్యర్థుల ఎంపిక..
Vizag Steel Plant
Follow us

|

Updated on: Nov 16, 2021 | 6:54 AM

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇక దరఖాస్తుల స్వీకరణకు గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 150 ఖాళీలకు గాను డిప్లొమా అప్రెంటిస్‌లు (50), గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు (100) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* డిప్లొమా అప్రెంటిస్‌లో భాగంగా మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్‌/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3542 స్టయిపెండ్‌ చెల్లిస్తారు.

* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లో భాగంగా మెకానికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

* ఎంపికైన నెలకు రూ.4984 స్టయిపెండ్‌ చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* 2019, 2020, 2021లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారు మాత్రమే పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను తొలుత డిప్లొమా/ఇంజనీరింగ్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 18-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..

Shamna Kasim: బ్లాక్ ఫార్మల్ డ్రెస్‏లో అదిరిపోయిన పూర్ణ.. ఇలా ఎప్పుడైనా ఊహించారా.. లెటేస్ట్ పిక్స్…

సామాన్యులకు మరో షాక్‌.. ఈ వస్తువుల ధరలు పెరుగనున్నాయి.. !

Latest Articles
రుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి కేఎల్ఆర్ ఔట్?
రుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి కేఎల్ఆర్ ఔట్?
బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌