AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC: నేడు విడుదల కానున్న యూపీఎస్‌సీ డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్.. స్టెప్‌ బై స్టెప్ పూర్తి వివరాలు మీకోసం..

UPSC: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌ ఈరోజు (నవంబర్‌ 16) డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ను (DAF) విడుదల చేయనున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే వారు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో..

UPSC: నేడు విడుదల కానున్న యూపీఎస్‌సీ డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్.. స్టెప్‌ బై స్టెప్ పూర్తి వివరాలు మీకోసం..
Upsc
Narender Vaitla
|

Updated on: Nov 16, 2021 | 10:40 AM

Share

UPSC: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌ ఈరోజు (నవంబర్‌ 16) డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ను (DAF) విడుదల చేయనున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే వారు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫామ్‌ను పొందొచ్చు. ఇక యూపీఎస్‌ మెయిన్స్‌ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు. సాధారణంగా యూపీఎస్‌సీ పరీక్షను ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రిలీమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్‌లో హాజరయ్యేందుకు DAFను ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్షల ఫలితాలను అక్టోబర్‌ 29న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 10 లక్షల మంది హాజరయ్యారు. ఇక ఈ నోటిఫికేషన్‌లో భాగంగా భారత ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో ఉన్న 712 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ను ఎలా నింపాలంటే..

* ముందుగా యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం టెన్త్‌ సర్టిఫికేట్‌లో ఉన్న విధంగా మీ పేరుతో రిజిస్టర్‌ కావాలి.

* తర్వాత పుట్టన రోజు తేదీని, ఈమెయిల్‌ అడ్రస్‌ను ఎంటర్‌ చేయాలి.

* రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థుల ఈమెయిల్‌ ఐడీకి పాస్‌వర్డ్‌ను వెళుతుంది.

* మళ్లీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి మెయిల్‌ వచ్చిన పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.

* వెంటనే ఆన్‌లైన్‌ DAF ఓపెన్‌ అవుతుంది.

* ఇందులో మొత్తం ఆరు మ్యాడుల్స్‌.. పర్సనల్‌, ఎడ్యుకేష్‌, పేరెంటల్‌ ఇన్ఫర్మేషన్, ఎప్లాయ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్, అప్‌లోడ్‌ డ్యాక్యుమెంట్స్‌, ఫైనల్‌ సబ్‌మిషన్‌ ఉంటాయి.

* అన్ని వివరాలను జాగ్రత్తగా ఎంటర్‌ చేసి చివరగా సబ్‌మిట్ బటన్‌ నొక్కాలి. దీంతో DAF ఫామ్‌ వస్తుంది. దానిని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.

* మ్యాడుల్స్‌లో వివరాలను ఎంటర్‌ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఎంటర్‌ చేస్తే మళ్లీ మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు.

Also Read: Srikanth: బడాహీరోకు భయపెట్టే పాత్ర ఇచ్చిన బోయపాటి.. జగ్గూభాయ్ బాటలో శ్రీకాంత్ కూడా..

Fixed Deposit Video: ఫిక్స్డ్ డిపాజిటర్లకు గుడ్‌న్యూస్‌…అధికవడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!(వీడియో).

Shalu Chourasiya: నటి శాలు చౌరాసియా పై దాడి.. సీరియస్ అయిన సీపీ అంజనీ కుమార్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.