Shalu Chourasiya: నటి శాలు చౌరాసియా పై దాడి.. సీరియస్ అయిన సీపీ అంజనీ కుమార్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.
హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి కలకలం రేపింది. వాకింగ్‌కు వచ్చిన ఆమెను ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కొట్టి, సెల్‌ఫోన్ లాక్కోవడం చర్చనీయాంశమైంది.
Shalu Chourasiya: హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి కలకలం రేపింది. వాకింగ్‌కు వచ్చిన ఆమెను ఓ ఆగంతకుడు విచక్షణారహితంగా కొట్టి, సెల్‌ఫోన్ లాక్కోవడం చర్చనీయాంశమైంది. కొండాపూర్‌లో ఉండే శాలు చౌరాసియా పలు తెలుగు, తమిళం సినిమాల్లో నటించారు. ఆమె ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కేబీఆర్ పార్కుకు ఆనుకుని ఉన్న ట్రాక్‌లో వాకింగ్ చేసేందుకు వచ్చారు. గంటన్నర పాటు వాకింగ్ చేసి ఓ చోట నిలబడ్డారు. ఇంతలో ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి ఆమె మూతికి గుడ్డ కట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో ఆమె కింద పడింది. దీంతో ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న రాయి వద్దకు తీసుకువెళ్లి తలను మూడుసార్లు దానికేసి కొట్టాడు. కాలితో తన్ని, పిడిగుద్దుల వర్షం కురిపించాడు.
ఒంటి మీద ఉన్న బంగారం, డబ్బులు కావాలని అడిగాడు. చౌరాసియా నిరాకరించడంతో మరోసారి దాడి చేసి ఆమె చేతిలో ఉన్న ఐ ఫోన్ లాక్కొని పారిపోయాడు. బాధితురాలు భయంతో పార్కు ప్రహరీని దూకి జూబ్లీహిల్స్ రోడ్డు మీదకు వచ్చి అరిచింది. స్టార్‌బక్స్ కాఫీ షాపు వద్ద ఉన్న డ్రైవర్లు ఆమెను గమనించి మంచి నీరు తాగించారు. వారి సెల్‌ఫోన్ తీసుకున్న చౌరాసియా 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె చేయి, మెడ మీద గాయాలయ్యాయి. నాలుగేళ్ల క్రితం కేబీఆర్ పార్కు చుట్టూ పోలీసులు ప్రత్యేకంగా 64 కెమెరాలను పెట్టించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సుమారు 8 కెమెరాలు ఉన్నా, అవి పని చేయడం లేదు. ఇక ఈ ఘటన పై నగర సీపీ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు. వీఐపీ జోన్ లొ దారి దోపిడీ జరగడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ దాడి ఘటనలో పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలతో కలిసి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కలా సీసీ కెమెరాలు ద్వారా జల్లెడ పడుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :