Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీనా మజాకా.. “భోళా శంకర్‌” కోసం భారీ సెట్స్ వేయిస్తున్న మెహర్ రమేష్..?

మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీనా మజాకా.. భోళా శంకర్‌ కోసం భారీ సెట్స్ వేయిస్తున్న మెహర్ రమేష్..?
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 16, 2021 | 8:56 AM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఏస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అంతే కాదు ఈ సినిమా కోసం మరికొన్ని సెట్స్ కూడా వేయనున్నారట. ఈ సినిమా చాలా భాగం సెట్స్ లో షూట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి పై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

భోళా శంకర్ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్‌లో చూపించబోతోన్నారు. అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. కీర్తి సురేష్ ఆయన చెల్లిగా కనిపించనున్నారు. పక్కా కమర్షియల్‌గా ఈ చిత్రం ఉండబోతోంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. భోళా శంకర్ వచ్చే ఏడాది థియేటర్స్ లో విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: నెట్టింట్లో బాలయ్య అభిమానుల హంగామా.. అఖండ పై అదిరిపోయే మీమ్స్‌..

Raj Tarun: సెక్యూరిటీ గార్డుల కష్టం ఈ సినిమా వల్ల నాకు తెలిసొచ్చింది.. రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Good Luck Sakhi: వెనకడుగేసిన కీర్తి సురేష్.. వాయిదా పడిన ‘గుడ్ లక్ సఖి’ మూవీ.. కారణం ఇదే..