Good Luck Sakhi: వెనకడుగేసిన కీర్తి సురేష్.. వాయిదా పడిన ‘గుడ్ లక్ సఖి’ మూవీ.. కారణం ఇదే..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్.

Good Luck Sakhi: వెనకడుగేసిన కీర్తి సురేష్.. వాయిదా పడిన 'గుడ్ లక్ సఖి' మూవీ.. కారణం ఇదే..
Good Luck Sakhi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 16, 2021 | 7:32 AM

Keerthy Suresh: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆతర్వాత ఈ అమ్మడు వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయ్యింది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్  ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది.

తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇది వరకు నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు నిర్మాత సుధీర్ చంద్ర ఓ ప్రకటన చేశారు. ‘పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10న సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరినీ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నామ’ని అన్నారు.

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డ్రీమ్‌ను నెరవేర్చనున్న జెర్సీ డైరెక్టర్.. అందేంటంటే..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..