Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డ్రీమ్‌ను నెరవేర్చనున్న జెర్సీ డైరెక్టర్.. అందేంటంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు చరణ్.

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డ్రీమ్‌ను నెరవేర్చనున్న జెర్సీ డైరెక్టర్.. అందేంటంటే..
Raam Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 16, 2021 | 7:14 AM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ గా కనిపించనున్నాడు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్నారు చరణ్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు మెగాపవర్ స్టార్. ఈ సినిమా కోసం అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ సినిమాలతోపాటు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రామ్ చరణ్.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ఈ సినిమాలతోపాటు జెర్సీ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వలో సినిమా చేయనున్నారు చరణ్. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించనున్నాడట. గతంలో ఓ ఇంట్రవ్యూలో చరణ్ మాట్లాడుతూ..స్పోర్ట్స్ డ్రామా’లో చేయాలని ఉందని అన్నాడు. స్పోర్ట్స్ మెన్ గా కనిపించడమనేది తన డ్రీమ్ అనీ అన్నారు. ఇప్పుడు ఆ కోరిక గౌతమ్ తిన్ననూరి తీర్చనున్నారని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..

Shamna Kasim: బ్లాక్ ఫార్మల్ డ్రెస్‏లో అదిరిపోయిన పూర్ణ.. ఇలా ఎప్పుడైనా ఊహించారా.. లెటేస్ట్ పిక్స్…

Shruti Haasan: రెడ్ డ్రెస్‏లో మెరిసిపోతున్న శ్రుతిహాసన్.. గులాబిని సైతం మైమరపించేలా ఉన్న ముద్దుగుమ్మ..