Raj Tarun: సెక్యూరిటీ గార్డుల కష్టం ఈ సినిమా వల్ల నాకు తెలిసొచ్చింది.. రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ సాలిడ్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ మంచి జోరుమీదున్నాడు ఈ కుర్ర హీరో.

Raj Tarun: సెక్యూరిటీ గార్డుల కష్టం ఈ సినిమా వల్ల నాకు తెలిసొచ్చింది.. రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Raj Tharun
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 16, 2021 | 7:42 AM

Raj Tarun: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ సాలిడ్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ మంచి జోరుమీదున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మూవీ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న అనుభవించు రాజా మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. కింగ్ నాగార్జున అనుభవించు రాజా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను, రెండో పాట ‘నీ వల్లే రా’ను హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు.

ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ సెక్యూరిటీ గార్డుగా క‌నిపించనున్నారు. సెక్యూరిటీ గార్డుల మీద తెర‌కెక్కిన మూడో పాట‌ను హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్ లో సెక్యూరిటీ గార్డుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. బతికే హాయిగా అంటూ సాగిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా..దీపు ఆలపించారు. గోపీ సుందర్ అందించిన బాణీకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.. అలా నిల్చుంటారు.. రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. వారు ఎంత కష్టపడతారో తెలిసింది. వారందరికీ హ్యాట్సాఫ్. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. కచ్చితంగా అందరూ ఎంటర్టైన్ అవుతారు’ అని రాజ్ తరుణ్ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డ్రీమ్‌ను నెరవేర్చనున్న జెర్సీ డైరెక్టర్.. అందేంటంటే..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..