Balakrishna: నెట్టింట్లో బాలయ్య అభిమానుల హంగామా.. అఖండ పై అదిరిపోయే మీమ్స్‌..

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అఖండ'..

Balakrishna: నెట్టింట్లో బాలయ్య అభిమానుల హంగామా.. అఖండ పై అదిరిపోయే మీమ్స్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2021 | 7:55 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ప్రగ్యాజైస్వాల్‌, శ్రీకాంత్, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌, గ్లింప్స్‌ అభిమానులను భాగానే ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ‘అఖండ’ ట్రైలర్‌ నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే 1.43కోట్ల వ్యూస్‌ సొంతం చేసుకున్న ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌ టాప్‌ ట్రెండింగ్‌లో ఉంటోంది.

ట్రైలర్‌లో బాలయ్య నోటి నుంచి వచ్చిన మాస్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో తమ ఫేవరెట్‌ హీరో ఖాతాలో మరో సూపర్‌హిట్‌ తప్పదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్‌, నెటిజన్లు చేస్తున్న హంగామా మామూలుగా ఉండడం లేదు. ట్రైలర్‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగులు, సన్నివేశాలు, యాక్షన్‌ సీక్వెన్స్‌పై రకరకాల మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న కొన్ని ‘అఖండ’ మీమ్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.

Also read:

Raj Tarun: సెక్యూరిటీ గార్డుల కష్టం ఈ సినిమా వల్ల నాకు తెలిసొచ్చింది.. రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Good Luck Sakhi: వెనకడుగేసిన కీర్తి సురేష్.. వాయిదా పడిన ‘గుడ్ లక్ సఖి’ మూవీ.. కారణం ఇదే..

Rajkumar Rao: వేడుకగా రాజ్‌కుమార్‌, పత్రలేఖల వివాహం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు