Rajkumar Rao: వేడుకగా రాజ్‌కుమార్‌, పత్రలేఖల వివాహం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు రాజ్‌కుమార్‌ రావ్‌- పత్రలేఖలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చండీగఢ్‌లోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌ వేదికగా

Rajkumar Rao: వేడుకగా రాజ్‌కుమార్‌, పత్రలేఖల వివాహం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు
Follow us
Basha Shek

|

Updated on: Nov 16, 2021 | 7:28 AM

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు రాజ్‌కుమార్‌ రావ్‌- పత్రలేఖలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చండీగఢ్‌లోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌ వేదికగా సోమవారం ఏడడుగులు నడిచారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. వివాహం అనంతరం నూతన వధూవరులు తమ పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2014లో విడుదలైన ‘సిటీ లైట్స్‌’ చిత్రంలో మొదటిసారి జంటగా నటించారు రాజ్‌ కుమార్‌, పత్రలేఖ. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి ‘బోస్‌: డెడ్‌ /అలైవ్‌ చిత్రంలో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుని మరోసారి అభిమానులను మురిపించారు.

అంతకంటే ఆనందం మరొకటి లేదు… ఈ సందర్భంగా రాజ్‌ కుమార్‌ తన సతీమణి నుదుటున కుంకుమ దిద్దుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ’11 ఏళ్ల ప్రేమ, స్నేహం, వినోదం తరువాత చివరికి ఈ రోజు నా సర్వస్వం, నా సోల్‌మెట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నా. ఈ రోజు నుంచి పత్రలేఖ భర్తగా పిలిపించుకోవడంకంటే గొప్ప ఆనందం మరొకటి లేదు’ అని ప్రేమను ఒలకబోశాడు. ఇక పత్రలేఖ కూడా తన వెడ్డింగ్‌ ఫొటోలను పంచుకుంటూ ‘ గత 11 ఏళ్లుగా నా బెస్ట్‌ ఫ్రెండ్‌, ప్రియుడు, నా క్రైమ్‌ పార్ట్‌నర్‌, నా సోల్‌మేట్‌, నా జీవిత సర్వస్వాన్ని ఈరోజు వివాహం చేసుకున్నాను. నాకు నీ భార్య అనిపించుకోవడం కంటే మరొకటి సంతోషాన్నివ్వదు’ అని తన భర్తపై ప్రేమను కురిపించింది. ఈ నేపథ్యంలో రాజ్‌కుమార్‌- పత్రలేఖల వెడ్డింగ్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, కియారా అద్వానీ, తాప్సీ, దియామీర్జా, ఆయుష్మాన్‌ ఖురానా తదితర ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

Also Read:

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డ్రీమ్‌ను నెరవేర్చనున్న జెర్సీ డైరెక్టర్.. అందేంటంటే..

పాలుగారే బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ యాంకర్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!!

Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..