AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth pet dogs: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని.. డిపిస్తున్న వీడియో

Puneeth pet dogs: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని.. డిపిస్తున్న వీడియో

Anil kumar poka
|

Updated on: Nov 16, 2021 | 9:30 AM

Share

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కర్ణాటక ప్రజలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో అలా ఆకస్మాత్తుగా తమను వదిలి వెళ్లిపోవడంతో కన్నడ చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.


కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నా.. ఇప్పటికీ కర్ణాటక ప్రజలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో అలా ఆకస్మాత్తుగా తమను వదిలి వెళ్లిపోవడంతో కన్నడ చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అటు పునీత్ కుటుంబసభ్యులకు.. ఇటు కన్నడిగులకు ఈ చేదు వార్త ఇంకా మింగుడుపడడం లేదు. పునీత్ మరణంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. తమ అభిమాన హీరో జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పునీత్ ఫోటోలను.. వీడియోలను షేర్ చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఎంతో ఆరాధించే అభిమానులు.. ప్రేక్షకుల పరిస్థితే ఇలా ఉంటే.. పునీత్ వెన్నంటి ఉండే పెంపుడు కుక్కల పరిస్థితి మరీ దారుణం. తమను అమితంగా ప్రేమించే యాజమాని పట్ల పెంపుడు కుక్కలు చూపించే విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సాధారణంగా చాలా మంది కుక్కలను.. పిల్లులను తమ ఇంట్లో సభ్యులుగా భావిస్తుంటారు.. వాటిపై లెక్కలేనంత ప్రేమను చూపిస్తుంటారు. ఇక అవి కూడా తమ యాజమాని పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తాయి. క్షణం తమ యాజమాని కనిపించకపోతే వారి కోసం ఆరాటపడిపోతుంటాయి. పునీత్ రాజ్ కుమార్‏కు సైతం కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన చాలా కుక్కలను పెంచుకున్నారు. గతంలో అనేకసార్లు.. తన పెంపుడు కుక్కలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అయితే తమతో ఎంతో ప్రేమగా ఉండే యాజమాని లేడన్న విషయం తెలియక ఆ కుక్క పిల్లలు కన్నీంటి పర్యంతమవుతున్నాయి. ఆయన ఫోటో ముందుకెళ్లి దీనంగా కుర్చుంటున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పునీత కనిపించకపోవడంతో అవి ఆహారం కూడా తీసుకోవడం లేదట. పునీత్.. ఇక రాడన్న విషయం వాటికి ఎలా చెప్పాలో తెలియక.. చివరికి రాజ్ కుమార్ సమాధి వద్దకు ఆ కుక్కలను తీసుకెళ్లారు. పునీత్ పెంపుడు కుక్కల పరిస్థితి చూస్తే అక్కడున్న వారికి కన్నీళ్లు ఆగడం లేదు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Published on: Nov 16, 2021 09:20 AM