Hyd Dancer Death: అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. కారణం ఇదేనా..? ఆర్కేస్ట్రా ట్రూపులో డ్యాన్సర్‌గా ఫాతిమా.. (వీడియో)
హైదరాబాద్‌లో ఓ డాన్సర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఆమె శవం అర్ధ నగ్న స్థితిలో ఉండడం మరింత అనుమానాలకు తావిచ్చింది. అంతేకాక, పక్కనే మద్యం సీసాను కూడా పోలీసులు కనుగొన్నారు.
హైదరాబాద్‌లో ఓ డాన్సర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ఆమె శవం అర్ధ నగ్న స్థితిలో ఉండడం మరింత అనుమానాలకు తావిచ్చింది. అంతేకాక, పక్కనే మద్యం సీసాను కూడా పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్‌లోని ముస్తఫానగర్‌లో ఈ ఘోరం జరిగింది. మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఆర్కేస్ట్రా గ్రూపులో డాన్సర్‌గా పని చేసే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక ముస్తఫానగర్‌కు చెందిన షరీన్ ఫాతిమా అనే 30 ఏళ్ల మహిళకు ఏడుగురు సంతానం ఉన్నారు. భర్త నదీం చనిపోవడం వల్ల ఆమె ఆర్కేస్ట్రా ట్రూపులో డ్యాన్సర్‌గా చేరి జీవనం సాగిస్తోంది. అయితే, మూడు రోజుల క్రితమే ఆమె మరో ప్రాంతం నుంచి ముస్తఫా నగర్‌కు మారింది. ఈ క్రమంలో అక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె ఆదివారం ఇంటి సామగ్రిని తరలించేందుకు కూలీలను మాట్లాడుకుంది. ఇల్లు షిఫ్టింగ్ ఉండడంతో పిల్లలను అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంచింది. ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే చనిపోయి కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధ నగ్నంగా ఉంది. పక్కనే బీరు బాటిల్ ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని ఫాతిమా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. గొంతుకు చున్నీతో లాగి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా భావిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు..ఇదిలా ఉంటే, ఫాతిమా భర్త గతంలో చనిపోవడం, తాజాగా తల్లి కూడా మరణించడంతో ఆమె ఏడుగురు పిల్లలు అనాథలు అయ్యారు. ఆ చిన్నారుల ఏడుపు స్థానికులందరినీ కంటతడిపెట్టుకునేలా చేసింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

