BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం పొందే అవకాశం..
BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సెంట్రల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఘజియాబాద్‌లోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను...
BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సెంట్రల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన ఘజియాబాద్‌లోని ఈ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 మెంబర్ (రిసెర్చ్ స్టాఫ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఫుల్ టెం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితో పాటు సంబంధిత విభాగంలో అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 30-09-2021 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000లతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.
* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 16-11-2021న ప్రారంభమవుతుండగా, 08-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Atm Dhagdham: ఏటీఎంలో మంటలు..బూడిదైన నోట్ల కట్టలు..! ఎవరు చేసారో సీసీ కెమెరాలో రికార్డు..(వీడియో)
రాంబోగా సేతుపతి.. ఖతిజాగా సమంత.. కణ్మణిగా నయనతార.. ఆకట్టుకుంటోన్న కొత్త మూవీ పోస్టర్లు..