Atm Dhagdham: ఏటీఎంలో మంటలు..బూడిదైన నోట్ల కట్టలు..! ఎవరు చేసారో సీసీ కెమెరాలో రికార్డు..(వీడియో)

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్నయాక్సెస్ బ్యాంక్‌ ఏటిఎం లో అర్థరాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. నగదు రాకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ఏటిఎం మిషన్ దగ్ధమైంది..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్నయాక్సెస్ బ్యాంక్‌ ఏటిఎం లో అర్థరాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. నగదు రాకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ఏటిఎం మిషన్ దగ్ధమైంది..ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమరాల్లో రికార్డైంది. తెల్లవారు జామున ఇద్దరు దొంగలు ఏటీఎం లోకి చోరబడ్డారు. ఆనవాళ్లు గుర్తు పట్టకుండా పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టడంతో భారీ శబ్దాలతో మంటలు చెలరేగి ఏటీఎం దగ్ధమైంది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు..హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చుట్టు పక్కల దుకాణాలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అప్పటికే ఏటిఎం గదిలోని ఏటిఎం మిషన్ నగదు జమ యంత్రం, కోడింగ్‌ యంత్రాలు, 2 ఏసీ లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఏటీఎంలో ఉన్న డబ్బు కూడా దగ్దం కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బారిగానే ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. నష్టంపై అంచనా వేస్తున్నారు. 

మరిన్ని చూడండి ఇక్కడ:

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

 

Click on your DTH Provider to Add TV9 Telugu