AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాంబోగా సేతుపతి.. ఖతిజాగా సమంత.. కణ్మణిగా నయనతార.. ఆకట్టుకుంటోన్న కొత్త మూవీ పోస్టర్లు..

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కాత్తు వాక్కుల రెండు కాదల్‌'. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది..

రాంబోగా సేతుపతి.. ఖతిజాగా సమంత.. కణ్మణిగా నయనతార.. ఆకట్టుకుంటోన్న కొత్త మూవీ పోస్టర్లు..
Basha Shek
|

Updated on: Nov 16, 2021 | 10:29 AM

Share

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. విఘ్నేశ్‌ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, విఘ్నేష్‌లకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ, 7 స్ర్కీన్స్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రూపొందించిన స్వరాలు ఇప్పటికే సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈక్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా సినిమాలో విజయ్‌ సేతుపతి, సమంత పాత్రల ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను విడుదల చేసింది. విజయ్‌ సేతుపతి మూడు ముఖాలతో కూడిన ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో అతని పాత్ర RAMBO (రంజన్‌కుడి అన్బరసు మురుగేశ భూపతి ఉహూన్‌ధీరన్‌)ను కూడా మనకు పరిచయం చేశారు. అదేవిధంగా ఖతిజా పాత్రలో నటిస్తోన్న సమంతను పోస్టర్‌, కణ్మణి పాత్రలో నటిస్తోన్న నయనతార పోస్టర్లను  ఆసక్తికరంగా డిజైన్‌ చేశారు. తొలుత ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం బాగా జరిగింది. అయితే అవన్నీ ఊహాగానాలేనని, తమ చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుంది చిత్రబృందం తెలిపింది.

Also Read:

Shalu Chourasiya: నటి శాలు చౌరాసియా పై దాడి.. సీరియస్ అయిన సీపీ అంజనీ కుమార్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.

Puneeth pet dogs: పునీత్ ఫోటో చూస్తూ దీనంగా పెంపుడు కుక్కలు.. వాటికెలా తెలిసేది ఇక ఆయన రాడని.. డిపిస్తున్న వీడియో

Megastar Chiranjeevi: మెగాస్టార్ మూవీనా మజాకా.. “భోళా శంకర్‌” కోసం భారీ సెట్స్ వేయిస్తున్న మెహర్ రమేష్..?